ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) యురోపియన్ దేశాల్లో క్రికెట్‌ను మరింత విస్తరించడానికి తాజాగా ఆయా దేశాల్లో యురోపియన్ క్రికెట్ లీగ్‌ను నిర్వహిస్తోంది. అందులో భాగంగా తాజాగా జరిగిన ఓ మ్యాచ్‌లో రొమేనియాకు చెందిన పవెల్ ఫ్లోరిన్ అనే ఓ స్పిన్ బౌలర్ విచిత్రమైన బౌలింగ్ విన్యాసంతో కెమెరాలకు చిక్కాడు.
క్రికెట్‌లో ఇప్పటి వరకు మనం అనేక దేశాలకు చెందిన భిన్నమైన ప్లేయర్లను చూశాం. ఈ క్రమంలోనే ఒక్కో ప్లేయర్ ఒక్కో రకమైన శైలిని కలిగి ఉంటాడు. బ్యాటింగ్ లేదా బౌలింగ్ ఎందులోనైనా సరే తమ శైలిని వారు ప్రదర్శిస్తుంటారు. అందులో భాగంగానే భిన్న రీతుల్లో బౌలింగ్ వేసే బౌలర్లను మనం ఇప్పటి వరకు చూశాం. అయితే ఇప్పుడు మేం చెప్పబోయేది కూడా అలాంటి ఓ విచిత్రమైన బౌలింగ్ వేసే బౌలర్ గురించే. ఇంతకీ అతను ఎవరంటే..?
ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) యురోపియన్ దేశాల్లో క్రికెట్‌ను మరింత విస్తరించడానికి తాజాగా ఆయా దేశాల్లో యురోపియన్ క్రికెట్ లీగ్‌ను నిర్వహిస్తోంది. అందులో భాగంగా తాజాగా జరిగిన ఓ మ్యాచ్‌లో రొమేనియాకు చెందిన పవెల్ ఫ్లోరిన్ అనే ఓ స్పిన్ బౌలర్ విచిత్రమైన బౌలింగ్ విన్యాసంతో కెమెరాలకు చిక్కాడు. అతని భిన్నమైన బౌలింగ్ శైలి పట్ల ఇప్పుడు నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
Ladies and gentlemen … welcome to the #EuropeanCricketLeague
??? pic.twitter.com/ctrhyJvs4b
— Fox Cricket (@FoxCricket) July 30, 2019
సాధారణంగా ఏ బౌలర్ అయినా సరే.. దాదాపుగా ఒకటే రీతిలో బౌలింగ్ ఉంటుంది. కానీ పవెల్ ఫ్లోరిన్ శైలి మాత్రం అందుకు భిన్నంగా ఉంది. ఈ క్రమంలోనే అతను బౌలింగ్ వేస్తున్న ఓ వీడియో ఇప్పుడు నెట్‌లో వైరల్‌గా మారింది. దీంతో పవెల్ బౌలింగ్‌కు అందరూ షాకవుతున్నారు. అయితే తన బౌలింగ్ విచిత్రంగా ఉండడం పట్ల తనకు ఎలాంటి ఇబ్బంది లేదని పవెల్ చెబుతున్నాడు. ఏది ఏమైనా.. ఇతని బౌలింగ్ మాత్రం ఇప్పుడు చాలా మందిని షాక్‌కు గురి చేస్తోంది..!