ఇటీవల విడుదలైన పవన్ కళ్యాణ్ బ్రో మూవీ సక్సెస్ ఫుల్ గా థియేటర్ లలో రన్ అవుతోంది. తమిళ దర్శకుడి సముధ్రఖని తమిళ్ లో ఆల్రెడీ తీసిన వినోదయ సీతం ను తెలుగు లో రీమేక్ చేశాడు. తెలుగు నేటివిటీ కి తగినట్లుగా కమర్షియల్ హంగులను దిద్ది ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చాడు. బాక్స్ ఆఫీస్ లెక్కల ప్రకారం ఈ సినిమా 100 కోట్ల కలెక్షన్ లను అందుకుని హిట్ గా నిలిచింది అంటూ నిర్మాతలు ప్రకటించారు. దీనికి ముందు పవన్ కళ్యాణ్ చేసిన హిందీ మూవీ పింక్ కు రీమేక్ గా వచ్చిన “వకీల్ సాబ్” సైతం మహిళల ఆదరణను దక్కించుకుని 100 కోట్ల కలెక్షన్ లను సాధించింది. ఆ తర్వాత మలయాళం మూవీ రీమేక్ గా భీమ్లా నాయక్ కూడా 100 కోట్ల కలెక్షన్ లను కొల్లగొట్టింది.
హ్యాట్రిక్ కొట్టిన పవన్ కళ్యాణ్ … 100 కోట్లు కొల్లగొట్టిన మూడు రీమేక్ లు !
-