అటు బాబు-ఇటు జగన్..పవన్‌కు అదే మైనస్..!

-

ఏపీలో నెక్స్ట్ అధికారం దక్కించుకోవడానికి వైసీపీ-టీడీపీలు గట్టిగా పోటీ పడుతున్నాయి. ఈ సారి కూడా ఎలాగోలా అధికారం దక్కించుకోవాలని జగన్ ప్రయత్నిస్తుంటే..ఈ సారి అధికారం దక్కించుకోకపోతే పార్టీ మనుగడకే ప్రమాదమని..అందుకే ఖచ్చితంగా అధికారంలోకి రావాలని చంద్రబాబు కష్టపడుతున్నారు. ఇలా ఇద్దరు నేతలు తమదైన శైలిలో వ్యూహాలు వేస్తూ..గెలుపు దిశగా వెళ్లాలని చూస్తున్నారు.

ఓ వైపు ప్రత్యర్ధి పార్టీని దెబ్బతీసేలా వ్యూహాలు వేస్తూనే..మరోవైపు సొంత పార్టీని బలోపేతం దిశగా తీసుకెళుతున్నారు. అధికారంలో ఉన్న జగన్..పథకాల రూపంలో ప్రజలకు డబ్బులు పంచుతూ..వారి మద్దతు తగ్గకుండా ఉండేలా చూసుకుంటున్నారు. అలాగే ఆయన ఏదొక కార్యక్రమం పేరుతో బహిరంగ సభలతో ప్రజల్లో ఉంటున్నారు. అలాగే ఎమ్మెల్యేలని గడపగడపకు పంపుతున్నారు. సరిగ్గా పనిచేయని ఎమ్మెల్యేలకు సీట్లు ఇవ్వనని చెప్పేస్తున్నారు. అలాగే ఎన్నికల కంటే ముందే అభ్యర్ధులని ఫిక్స్ చేసేలా జగన్ పనిచేస్తున్నారు. నిత్యం పార్టీ గెలుపు కోసం ఆయన కష్టపడుతున్నారు.

ఇటు చంద్రబాబుయి అదే పనిలో ఉన్నారు..వైసీపీకి చెక్ పెట్టేలా ప్రజల్లోకి వెళుతున్నారు..పథకాల పేరిట రూపాయి ఇచ్చి, పన్నుల పేరిట పది రూపాయిలు కొట్టేస్తున్నారని, టి‌డి‌పి వస్తేనే రాష్ట్రం బాగుపడుతుందని, జగన్ హయంలో నాశనం అయిందని ప్రచారం చేస్తున్నారు. బాబు ఎప్పటికప్పుడు ప్రజల్లో తిరుగుతూనే ఉన్నారు. అటు లోకేష్ సైతం యువగళం పాదయాత్రతో ప్రజల్లో ఉంటున్నారు.

అదేవిధంగా నేతలకు దిశానిర్దేశం చేస్తూ అభ్యర్ధులని సైతం బాబు ఫిక్స్ చేసుకుంటూ వెళుతున్నారు. ఇలా జగన్, బాబు దూకుడుగా ఉన్నారు. కానీ జనసేన అధినేత పవన్ ..ఇంకా జనంలోకి రావడం లేదు. ఏదో అప్పుడప్పుడు మాత్రమే వచ్చి వెళ్లిపోతున్నారు. ఇటు క్షేత్ర స్థాయిలో జనసేన నేతలు పూర్తిగా ప్రజల్లోకి వెళ్ళడం లేదు. దీని వల్ల పార్టీ బలం అనుకున్న మేర పెరగడం లేదు. అయితే పవన్ జనంలోకి వస్తేనే జనసేనకు ప్లస్..మరి పొత్తు ఉంటుందని చెప్పి పవన్ కాస్త లైట్ తీసుకుంటున్నారా? అనే పరిస్తితి. ఇంకా ఎన్నికల ముందే పవన్ జనంలోకి వచ్చేలా ఉన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version