వినోద‌య సీత‌మ్ తెలుగు రీమేక్‌కు ప‌వ‌న్ భారీ రెమ్యూన‌రేషన్!

-

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్.. వ‌కీల్ సాబ్ మూవీతో సినీ ఇండస్ట్రీ రీ ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసందే. కాగ ఈ సినిమా త‌ర్వాత ప‌వ‌న్ క‌ళ్యాణ్ వ‌రుస సినిమాలు చేస్తు.. స్పీడ్ పెంచాడు. ఇటీవ‌ల విడుద‌ల అయిన భీమ్లా నాయ‌క్ సూప‌ర్ హిట్ కొట్టింది. అలాగే ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప్ర‌స్తుతం హ‌రి హ‌ర వీర మ‌ల్లు అనే సినిమాలో టైటిల్ రోల్ చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ఇప్ప‌టికే ప్రారంభం అయింది. ఈ సినిమా త‌ర్వాత మ‌రో సినిమా చేయ‌డానికి ప‌వ‌న్ క‌ళ్యాణ్ సిద్దం అయ్యాడు.

త‌మ‌ళంలో సూప‌ర్ హిట్ అయిన వినోద‌య సీత‌మ్ అనే సినిమాలో ప‌వ‌న్ క‌ళ్యాణ్ న‌టిస్తున్నాడు. కాగ ఈ సినిమాలో మెగా మేన‌ల్లుడు, సుప్రీం హీరో సాయి ధ‌ర‌మ్ తేజ్ తో క‌లిసి ప‌వ‌న్ క‌ళ్యాణ్ న‌టిస్తున్నారు. కాగ ఈ సినిమాను త‌మిళ్ లో ద‌ర్శ‌కత్వం వ‌హించిన స‌ముద్ర ఖ‌నినే తెలుగులో కూడా డైరెక్ట్ చేస్తున్నాడు. కాగ ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఈ సినిమాలో దేవుడి పాత్ర‌లో క‌నిపించ‌బోతున్నారు.

అయితే ఈ సినిమాకు సంబంధించి ప‌వ‌న్ క‌ళ్యాణ్ భారీ రెమ్యూన‌రేషన్ తీసుకుంటున్నార‌ని తెలుస్తుంది. ఈ సినిమాకు ఏకంగా రూ. 60 కోట్ల పారితోషకం తీసుకుంటున్నట్టు స‌మాచారం. కాగ ఈ సినిమాలో త‌న పాత్ర షూటింగ్ కోసం ప‌వ‌న్ కేవ‌లం 20 రోజుల షెడ్యూల్ ఇచ్చిన‌ట్టు తెలుస్తుంది. ఈ వార్త నిజం అయితే.. ప‌వ‌న్ క‌ళ్యాణ్ రోజుకు రూ. 3 కోట్ల చొప్పున రెమ్యూన‌రేషన్ తీసుకుంటున్న‌ట్టు.

Read more RELATED
Recommended to you

Latest news