ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దేశ రాజధాని ఢిల్లీలో బిజీ బిజీగా గడుపుతున్నారు.రాష్ట్ర అభివృద్ధి, నిధుల కోసం వరుసగా కేంద్రమంత్రులతో భేటీ అవుతున్నారు. తాజాగా కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్‌తో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా బొబ్బిలి వీణను కేంద్రమంత్రికి పవన్ కళ్యాణ్ బహుకరించారు.
అనంతరం రాష్ట్రానికి సంబంధించిన పలు ప్రాజెక్టులకు పర్యావరణ అనుమతుల విషయంపై వీరిద్దరి మధ్య చర్చ జరిగింది. ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో పాటు జనసేన ఎంపీలు వల్లభనేని బాలశౌరి, తంగేళ్ల ఉదయ్ శ్రీనివాస్ సైతం ఉన్నారు. రాష్ట్రంలో ఏర్పాటు కానున్న ఎయిర్ పోర్టులు, కొత్త కంపెనీలు, ప్రాజెక్టులకు పర్యావరణ అనుమతులు త్వరగా జారీ అయ్యేలా చూడాలని పవన్ కళ్యాణ్ కేంద్రమంత్రికి విజ్ఞప్తి చేశారు.