జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు మంత్రి అంబటి రాంబాబు. పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టి ఒక కులం ఓట్లను మరొక కులానికి అమ్ముతున్నాడని తీవ్ర విమర్శలు చేశారు. ఒంటరిగా పోటీ చేస్తే ఆయన ఎమ్మెల్యేగా కూడా గెలవలేదని ఎద్దేవా చేశారు మంత్రి అంబటి రాంబాబు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వనని చెప్పడం వెనుక ఆంతర్యం ఏమిటో పవన్ కళ్యాణ్ చెప్పాలని డిమాండ్ చేశారు.
సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి ని ఎవరు ఓడించలేరని ధీమా వ్యక్తం చేశారు. 2024 లో కూడా జగన్ ముఖ్యమంత్రిగా గెలుపొందుతారని జోష్యం చెప్పారు. ప్రజల్లో నాయకులుగా ఉన్న వాళ్లకే ఇప్పుడు సీట్లు కేటాయిస్తున్నారని.. కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు ఎన్నికల సమయంలో మాత్రమే నాయకులు బయటికి వచ్చేవాళ్ళు కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదన్నారు. ప్రతి ఇంటికి, ప్రతి గడపకు తిరిగిన వారే నాయకుడు అవుతారని స్పష్టం చేశారు మంత్రి అంబటి రాంబాబు.