ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన జీవో నెంబర్ 217.. మృత్స్యకారులకు పెద్ద సమస్యగా మారిందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. ఒక వేళ జనసేననే.. ప్రభుత్వంగా ఉంటే.. ఈ జీవో నెంబర్ 217 ను వచ్చేదే కాదని అని అన్నారు. వైసీపీ ప్రభుత్వం తీసుకువచ్చిన ఈ జీవో నెంబర్ 217 గుది బండగా మారిందని విమర్శించారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో దాదాపు 517 మత్స్యకార గ్రామాలు ఉన్నాయని అన్నారు. ఈ జీవో ఆయా గ్రామాలకు ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారని అన్నారు.
జనసేన ప్రభుత్వం కాకున్నా.. కనీసం 10 మంది ఎమ్మెల్యే లు ఉన్నా.. ఈ జీవో వచ్చేది కాదని అన్నారు. అనంతరం జీవో నెంబర్ 217 కు సంబంధించిన కాగితాలను పవన్ కళ్యాణ్ చించారు. తనపై ఇక కేసులు పెట్టుకుంటే.. పెట్టుకోండని అన్నారు. అలాగే తాను చట్టాలను గౌరవిస్తానని అన్నారు. కానీ ప్రజల పొట్ట కొట్టే చట్టాలు వద్దు అని అన్నారు. సర్కారునే చించిస్తే అని ఘాటుగా విమర్శించారు. కాగ తాము సంయమనం పాటిస్తున్నామంటే.. అది తమ బలం అని అన్నారు.