థాక్రే- సీఎం కేసీఆర్ సమావేశంపై ఈటెల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కూట్లో రాయి తీయలేనివాడు ఏట్లో రాయి తీయబోయినట్లు ఉంది కెసిఆర్ వ్యవహారం అంటూ చురలకు అంటించారు. తన తప్పులు కప్పిపుచ్చుకోవడానికే కెసిఆర్ కొత్త ఎజెండా ఎత్తుకున్నారని మండిపడ్డారు. NDA లేదా UPA తప్ప దేశంలో ప్రాంతీయ పార్టీల కూటమికి అవకాశం లేదని తేల్చి చెప్పారు.
గిరిజన దేవతలు కాబట్టి వారికి నోరు లేదు కాబట్టి సీఎం పోలేదని.. కుంభమేళా తరువాత అంత పెద్ద జాతర ఇది. ప్రజల సంస్కృతిని గౌరవించరా ? అని నిలదీశారు. చదువుకున్న విద్యార్థులకు నోటిఫికేషన్ లేక, ఉద్యోగాలు లేక, పెళ్లిళ్లు కాక నిస్పృహతో ఆత్మహత్యలు చేసుకుంటున్నారని మండిపడ్డారు.
చదువుకున్న అన్నకి పెళ్లి కాకుండా.. వ్యవసాయం చేసే తమ్ముడు ముందుగా పెళ్లిళ్లు చేసుకొనే పరిస్థితి వచ్చిందని నిప్పులు చెరిగారు. Mlc ఎన్నికల సమయంలో కేటీఆర్ ఒక లేఖ రాశారని.. దానిలో 1,32,899 ఉద్యగాలు నింపారు అని చెప్పారన్నారు. ఆర్టీసీ లో 4768 మందిని నింపారు అని చెప్పడం పచ్చి అబద్దం. ఆర్టీసీ లో ఒక్క డ్రైవర్, కండక్టర్ కూడా నింపలేదని మండిపడ్డారు. విద్యుత్తు శాఖలో 22637 మంది నీ క్రమబద్దీకరణ చేసి ఉద్యోగాలు కల్పించామని గొప్పలు చెప్తున్నారని ఆగ్రహించారు.