జనసేన అధినేత పవన్ గురించి ఆసక్తి కర చర్చ ఒకటి సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. అదేంటంటే .. గతంలో పవన్ పదే పదే ఒక మాట అనేవారు. అది కూడా ఎన్నికలు ముగిసిన తర్వాత.. సార్ మీరు ఇప్పు డు ఏం చేయాలనుకుంటున్నారు? ఎన్నికలు కూడా అయిపోయాయి కదా? మరి సీనీ ఫీల్డ్ సంగతేంటి? అని పాత్రికేయ మిత్రులు ప్రశ్నించినప్పుడు పవన్ ఆసక్తిగా ఓ వ్యాఖ్య చేశారు. తర్వాత తర్వాత ఆ వ్యాఖ్యలనే ఆయన ఉటంకించారు. అదేంటంటే.. “జగన్ పాలన భయానకంగా ఉంది. అన్ని వ్యవస్థలను ఆయన భ్రష్టు పట్టిస్తున్నారు. అందుకే నేను వాటిపై పోరాడుతున్నాను“- అని చెప్పుకొచ్చేవారు.
అంతటితో ఆగిపోయి ఉంటే.. పవన్ గురించి ఇప్పుడు చర్చ ఉండేది కాదు. కానీ, ఆయన ఇతర పార్టీల నాయకుల మాదిరిగా మాత్రం కామెంట్లు చేయకుండా.. మరో మాట కూడా అన్నారు. అదే ఇప్పుడు చర్చ కు దారితీస్తోంది. అదేంటంటే..“నాకు ప్రత్యేకంగా ఆదాయం ఏమీలేదు. పార్టీ పెట్టి డబ్బులు సంపాయిం చుకునే వాడినే అయితే.. గడిచిన ఎన్నికల్లో రూపాయికూడా ఆశించకుండానే అనేక మందికి బీ-ఫారాలు ఇచ్చాను. అయినా పార్టీ పెట్టింది ప్రజలకు సేవ చేయడానికి. డబ్బులు కావాలని అనుకుంటే.. నేను సిని మాల్లోనే ఉండేవాడిని. నాకు బాలీవుడ్ స్థాయిలో రెమ్యునరేషన్ ఇచ్చేందుకు నిర్మాతలు రెడీగా ఉన్నారు. గతంలో ఓ యాడ్‌కు అలానే తీసుకున్నాను“ అన్నారు.
అంతటితోనూ ఆగిపోకుండా.. “ఇప్పుడు కూడా నాకు డబ్బులు అవసరం. పార్టీ తరఫున ఏదైనా కార్యక్ర మం నిర్వహించాలంటే.. పార్టీ పక్షాన మూలనిధి అవసరం కదా?! అది ఎవరిస్తారు? ఎవరిని అడుగుతాం. పోనీ.. సినిమాల్లోకి వెళ్లిపోదామంటే.. రాష్ట్రంలో జగన్ పాలన సరికాలేదు. జగనే కనుక సుభిక్షంగా పాలన సాగిస్తే.. నాకు ఇక్కడ మీటింగులు పెట్టాల్సిన పనిలేదు. హాయిగా వెళ్లి సినిమాలు చేసుకుంటాను. మళ్లీ ఎన్నికల సమయానికి వస్తాను. నాకు పడాల్సిన ఓట్లు నాకు పడతాయి“- అని ముక్తాయించారు. కట్ చేస్తే.. ఇప్పుడు గడిచిన నెల రోజులుగా పవన్ ఎక్కడా కనిపించడం లేదు. సినిమాల్లో బిజీ అయ్యారు. ఇదే విషయాన్ని మేధావులు లేవనెత్తుతున్నారు.
“..అంటే.. పవన్ సినిమాల్లోకి వెళ్లిపోయారు అంటే.. రాష్ట్రంలో జగన్ సుభిక్షంగా పాలన సాగిస్తున్నారన్న మాట!!“ అని చెప్పుకొంటున్నారు. మరి పవన్ చేసిన వ్యాఖ్యలను బట్టి దీనిని కొట్టిపారేయలేం కదా! సో.. పవన్ చెప్పినట్టు జగన్ పాలన బాగున్నట్టే. అందుకే ఆయన సినిమాల్లో బిజీ అయ్యారు. సో.. ఆయనను ఎవరూ తప్పుపట్టడానికి లేదన్నమాట! అంటున్నారు మేధావులు. సో.. ఎవరైనా పవన్‌పై కామెంట్లు చేసే ముందు, ముఖ్యంగా ఆయన సినిమాల్లోకి వెళ్లిపోయారనేవారు.. ఈ విషయాన్ని రివైండ్ చేసుకుంటే బెటర్ అని అంటున్నారు మేధావులు. ఇదీ కథ!!