బిజెపి పార్టీ తో దోస్తీ కట్టడానికి ఎగబడుతున్న పవన్ కళ్యాణ్ వ్యవహరిస్తున్న రాజకీయ తీరుపై అన్ని వర్గాల నుండి తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నేను భారతీయుడిని నాకు కులం లేదు మతం లేదు అంటూ వేదికపై ప్రసంగాలు చేసే పవన్ కళ్యాణ్ మతతత్వ పార్టీ అయినా బీజేపీతో చేతులు కలపడాని చాలా మంది రాజకీయ నాయకులు అదేవిధంగా జనసేన పార్టీకి ఎప్పటినుండో అండగా ఉంటున్న కొన్ని సామాజిక వర్గాలు తీవ్రస్థాయిలో తప్పు పడుతున్నాయి.
ఇదిలా ఉండగా తాజాగా సొంత పార్టీలోనే కార్యకర్తలు పవన్ కళ్యాణ్ తీసుకున్న నిర్ణయం పట్ల సీరియస్ అవుతున్నారు. ఎన్నికల సమయంలో పార్టీ నాయకులతో చర్చించకుండా ఇష్టానుసారం నిర్ణయాలు తీసుకుని ఎన్నికలు అయిపోయాక మీ వల్లే నేను ఓడిపోయాను అంటూ మాట్లాడటం తరువాత ఓటర్లను బిచ్చగాళ్ళ తో పోల్చటం బట్టి చూస్తే పవన్ కళ్యాణ్ కి సరైన రాజకీయ అవగాహన లేదని అర్థమైంది అంటూ చెంపలేసుకుంటున్నారు.
గతంలో చిరంజీవి ని నమ్ముకుని చొక్కాలు చించుకుని ఎర్రి పప్ప అయితే తాజాగా తమ్ముడు కూడా ఆ స్థాయిలోనే ఎర్రి పప్పులు చేశారు అంటూ మరికొంతమంది మండిపడుతున్నారు. సమాజం మీద ఏదో ప్రేమ ఏదో తపన అంటూ కల్లబొల్లి మాటలు చెప్పి పార్టీలు పెట్టి అభిమానాన్ని ఆసరాగా చేసుకుని చలామణి అవుతూ చివరాకరికి అభిమానులను మోసం చేసిన పవన్ కళ్యాణ్ కి భవిష్యత్తే చాలా గట్టిగా బుద్ధి చెబుతోందని బీజేపీతో కలవటం మాకు ఇష్టం లేదు అంటూ సొంత పార్టీ కార్యకర్తలు పవన్ కళ్యాణ్ తీసుకున్న నిర్ణయం పట్ల మండిపడుతున్నారు. కచ్చితంగా ఇది పవన్ కళ్యాణ్ పొలిటికల్ కెరియర్ కి భారీ దెబ్బ అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు.