రాష్ట్రంలో సీట్లు, స్థానాలు లేకపోయినా.. ఒకింత ప్రజల్లో ఉన్న జాతీయ పార్టీ బీజేపీ.. రాజధాని విషయంపై తాజాగా మూకుమ్మడి నిర్ణయం తీసుకుంది. తాము ఎట్టి పరిస్థితిలోనూ అమరావతి రాజధానికే బద్ధులపై ఉంటామని చెప్పుకొచ్చారు నాయకులు. అదే సమయంలో రాష్ట్ర రాజదాని విషయంలో కేంద్రం జోక్యం చేసుకుంటుందని, ఒక్క అంగుళం కూడా రాజధానిని కదిలించేందుకు కేంద్రం ఎట్టి పరిస్థితిల్లోనూ ఒప్పు కోదని, కేంద్రం కూడా నిధులు ఇచ్చిందని నిన్నమొన్నటి వరకు చెప్పుకొచ్చిన బీజేపీ నాయకులు హఠా త్తుగా మాట మార్చారు.
ఏపీ బీజేపీ పక్షం భేటీలో తాము కొత్తగా ఒక తీర్మానం చేశామంటూ అధ్యక్షుడు కన్నా కొన్ని విషయాలను చది వి మీడియాకు వివరించారు. రాజధాని విషయంలో కేంద్రం జోక్యం చేసుకోబోదనే విషయాన్ని స్పష్టం చేసేశారు. అయితే, గతంలో ఇష్టమో .. కష్టమో.. అమరావతిని ఏర్పాటు చేశారు కాబట్టి.. జగన్ కూడా అప్ప ట్లో దీనికి ఓటు వేశారు కాబట్టి.. దీనిని కొనసాగించాలనే డిమండ్ చేస్తున్నామన్నది బీజేపీ నేతల మాట. ఇదే సమయంలో కేంద్రం విషయాన్ని పక్కకు తప్పించేశారు.
ఇక, రాష్ట్ర ప్రభుత్వం నిధుల విషయంలో కేంద్రాన్ని సంప్రదించకుండా ముందుకు వెళ్లదని చెప్పారు.
మరి ఆ సమయంలో కేంద్రం జోక్యం చేసుకునే అవకాశం ఉందని మాత్రమే వెల్లడించారు. ఇక, ఈ నెల సం క్రాంతి తర్వాత నుంచి తాము రాజధాని ప్రత్యక్ష ఉద్యమంలో పాల్గొంటామని చెప్పారు. అయితే, ఏ పార్టీతోనూ జతకట్టే ప్రయత్నం చేయబోమని తెలిపారు. ఈ క్రమంలోనే తమ పార్టీ విధాన నిర్ణయాలను తామే వెల్లడిస్తామని, ఎవరో ఏదో మాట్లాడితే.. దానిని పార్టీకి ముడిపెట్టవద్దని నాయకులు చెప్పుకొచ్చారు.
వెరసి మొత్తంగా బీజేపీ వ్యూహం.. రాజధాని విషయంలో కేంద్రాన్ని సేఫ్ గా పక్కకు తప్పించడమేననే విషయం స్పష్టంగా అర్ధమైంది. ఎక్కడ జోక్యం చేసుకున్నా.. నిధులు ఇవ్వాల్సి ఉంటుందని భావిస్తున్నారా? లేక.. రాష్ట్రం తిప్పులు రాష్ట్రం పడుతుందని అనుకుంటున్నారా? అనేది చూడాలి.