ప‌వ‌న్ ల‌క్ష్యం ప్లాపే… డెడ్‌లైన్ ముగిస్తే ఏం చేస్తాడో…!

-

రాష్ట్రంలో నెల‌కొన్ని ఇసుక సమస్యపై గళమెత్తుతూ.. భవన నిర్మాణ కార్మికులకు మద్దతుగా.. జ‌న‌సేన అధినేత‌ పవన్‌కల్యాణ్ చేసిన లాంగ్ మార్చ్‌కు టీడీపీ, బీజేపీ స‌హా దాదాపు అన్ని రాజకీయ పార్టీలు సంఘీ భావం తెలిపాయి. ఒక మంచి పనికోసం జనసేనాని పోరాటం చేస్తున్నారని సంపూర్ణ మద్దతు ప్రకటించాయి. కొన్ని పార్టీల నేతలు స్వయంగా బహిరంగ సభలో పాల్గొని ఇసుక సమస్య, భవన నిర్మాణ కార్మికులు ఎదుర్కొంటున్న ఇబ్బందులకు జగన్ సర్కారే కారణమని నిప్పులు చెరిగారు. ఒకరకంగా చూస్తే లాంగ్ మార్చ్ ప్రతిపక్షాలన్నింటినీ ఏకం చేసిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ఇక‌, ఈ లాంగ్ మార్చ్ ద్వారా ప‌వ‌న్ .. వైసీపీ ప్ర‌భుత్వంపై నిప్పులు చెరిగారు. మంత్రుల‌పైనా, సీఎం జ‌గ‌న్ పైనా విరుచుకుప‌డ్డారు. అదేస‌మ‌యంలో ప్ర‌భుత్వానికి డెడ్‌లైన్ విధించారు. రెండు వారాల్లోగా రాష్ట్రంలో ఇసుక కొర‌త లేకుండా చేయాల‌ని లేక‌పోతే.. త‌న ఉగ్ర‌రూపం, త‌డాఖా ఇత్యాదివి చూడాల్సివి వ‌స్తుంద‌ని ప‌వ‌న్.. వైసీపీ ప్ర‌భుత్వాన్ని హెచ్చ‌రించారు. దీంతో జ‌న‌సేన ద‌ళంలో ఊహించిన దానిక‌న్నా ఉత్సాహం రెట్టింప‌యింది.

లాంగ్ మార్చ్, బహిరంగసభ విజయవంతం కావడం, వాటికి ఊహించిన దానికంటే జనం ఎక్కువగా రావడం జనసేన పార్టీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపింది. ఇంత వ‌ర‌కు బాగానే ఉన్నా.. లాంగ్ మార్చ్ ముగిసి నేటి ఆదివారంతో వారం ముగిసింది. దీంతో ప‌వ‌న్ చేసిన ప్ర‌క‌ట‌నలు, హెచ్చ‌రింపులు, గ‌ద్దింపుల‌కు ఇప్ప‌టి వ‌ర‌కు ఏమైనా రిజ‌ల్ట్ వ‌చ్చిందా? అనేచ‌ర్చ తెర‌మీదికి వ‌చ్చింది. ప‌వ‌న్ విధించిన రెండు వారాల గ‌డువులో ఒక వారం ముగిసిపోయింది. ఈ వారంలో ఇసుక ప‌రిస్థితి ఎక్క‌డైనా చ‌క్క‌బ‌డిందా? అంటే ఎక్క‌డా లేద‌నే చెప్పాలి.

ఇక ప‌వ‌న్ డెడ్‌లైన్ వైసీపీ చాలా లైట్ తీస్కొంది. ఇంకా చెప్పాలంటే ప‌వ‌న్ ఇచ్చిన డెడ్‌లైన్ దాటిని ఎంత మాత్రం ప‌ట్టించుకోలేదు. రాష్ట్రంలో ఉభ‌య న‌దులు కూడా జోరుగా ప్ర‌వ‌హిస్తున్నాయి. ఇంకా పైరాష్ట్రాల్లో వర్షాలు త‌గ్గ‌లేదు. దీంతో ఇసుక ల‌భ్య‌త‌పై ప్ర‌భుత్వం ఎత్తేసిన చేతులు ఇంకా దించ‌నేలేదు. మ‌రి ఇప్పుడు ప‌వ‌న్ ఏం చేయ‌నున్నారు? అనే ప్ర‌శ్న తెర‌మీదికి వ‌స్తోంది. మ‌రో వారంలో కూడా ప‌రిస్థితి ఇలాగే ఉంటుంద‌ని, పెద్ద‌గా మార్పులు ఏమీ ఉండ‌బోవ‌ని చెబుతున్నారు. మ‌రి ప‌వ‌న్ ఏం చేస్తారో చూడాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version