కొన్ని గంట‌ల్లో పెళ్లి.. కానీ ఇంత‌లోనే పెళ్లి కొడుకు..

-

పెళ్లికి వచ్చిన బంధువులు, మిత్రులతో ఆ ఫంక్షన్ హాల్ అంతా సందడి నెలకొంది. ముహూర్తానికి సమయం దగ్గరపడుతోందని తొందర మొదలైంది. అయితే మరికొద్ది గంటల్లో పెళ్లి బాజాలు మోగాల్సిన ఫంక్షన్ హాల్లో బంధువులు ఆర్తనాదాలు వెల్లువెత్తాయి. ఫంక్షన్ హాల్ లోని గదిలోనే పెళ్లి కుమారుడు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాద ఘటన మేడ్చల్ జిల్లాలో చోటు చేసుకుంది. పెళ్లి ముహూర్తానికి ముందు వరుడు సందీప్ ఆత్మహత్య చేసుకున్నాడు.

కొంపల్లిలోని ఫంక్షన్ హాల్ లో చోటు చేసుకున్న ఈ ఘటనపై బషీరాబాద్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. అతడు ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడన్న విషయంపై ఆరా తీస్తున్నారు. కాసేపట్లో పెళ్లి కావాల్సిన కుమారుడు ఇలా అర్ధ్రాంతరంగా చనిపోవడంతో.. అతని తల్లిదండ్రులు, బంధువులు శోకసంద్రంలో మునిగారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version