జనసేన అధినేత పవన్ కల్యాణ్ వారాహి యాత్ర నేడు విశాఖ జగదాంబ సెంటర్‌లో నిర్వహించారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ.. ఏమి మాట్లాడతాడో చూద్దాం అనుకుంటున్న వైసీపీ నాయకులుకి నమస్కారాలు అంటూ.. ప్రభుత్వంపై పోరాడటానికి విశాఖ ధైర్యం ఇచ్చిందన్నారు. ప్రొద్దునే పథకం కింద డబ్బులు ఇస్తారని, సాయంత్రం సారా కింద డబ్బులు లాగేసుకుంటుంది ఈ ప్రభుత్వమని ఆయన విమర్శలు గుప్పించారు. గుండాలు, రియల్ ఎస్టేట్ రాబందులు చేతులులో విశాఖ ఇరుక్కుపోయిందని, గుండాలు తోలు తీయడానికి పవన్ కల్యాణ్ మీ కోసం ఉన్నారంటూ ఆయన వ్యాఖ్యానించారు. వైసీపీని ఉత్తరాంధ్ర నుంచి తరిమేయాలన్నారు.
ఈ సందర్భంగా ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డిపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఉమెన్ ట్రాఫికింగ్ ఎక్కువగా జరుగుతోందని ఆరోపించారు. తత మూడు పెళ్లిళ్లపై విమర్శలు చేయడం తప్ప.. రాష్ట్రంలో ఏం జరుగుతున్నా సీఎం జగన్‌కు పట్టదని మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్రం రావడానికి ప్రధాన కారణం జగనేనని పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు. హైదరాబాద్‌లో ఎక్కువగా దౌర్జన్యాలు చేయడం వల్లే ఆంధ్ర వాళ్లను అక్కడి ప్రజలు తన్ని తరిమేశారని పవన్ గుర్తు చేశారు. అందులో జగన్ ముఖ్యమైన వ్యక్తి అని పవన్ పేర్కొన్నారు. వైసీపీని తన్ని తరిమే వరకూ తాను నిద్దపోనని చెప్పారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే కొండలు తవ్వేస్తారని గత ఎన్నికల్లో తాను గొంగు చించుకుని మరీ చెప్పానని పవన్ తెలిపారు. అడ్డంగా దోచుకున్న వారిని గద్దెనెక్కించారని పవన్ వ్యాఖ్యానించారు. అయితే ఇష్టానుసారం పాలన సాగిస్తామంటే చొక్కాలు పట్టుకుని నిలదీస్తామని తెలిపారు. తాను చూడటానికి పలుచగా ఉన్నా ఒళ్లంతా మందమని పవన్ కల్యాణ్ హెచ్చరించారు.