కేసీఆర్‌ మాటలు కోటలు దాటుతాయి.. పనులు తంగేళ్లు దాటవు : ఈటల

-

మెదక్ గడ్డ నుంచే యుద్ధం మొదలయిందని బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ అన్నారు. గురువారం నాడు ఈటెల మీడియాతో మాట్లాడుతూ..‘‘తెలంగాణ రాష్ట్రం గొప్పగా ఎదుగుతున్న రాష్ట్రం. మంత్రులు హరీశ్‌రావు, కేటీఆర్ మా పై అసెంబ్లీలో దాడి చేశారు. 9 ఏళ్ల కాలంలో పన్నుల రూపంలో కట్టింది 20 లక్షల కోట్లు. 20 లక్షల కోట్లలో డబుల్ బెడ్రూం ఇళ్లకు ఇచ్చింది ఎంత.?ఇళ్ల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం 11వేల కోట్లు ఖర్చు చేసింది. అందులో హడ్కో సంస్థలో 8600 కోట్ల అప్పు తెచ్చింది. 1311 కోట్లు కేంద్రప్రభుత్వం ఇచ్చింది. తెలంగాణ ప్రభుత్వం కేవలం 500 కోట్లు ఇచ్చింది.శాసనసభలో డబుల్ బెడ్రూం ఇల్లు, నిరుద్యోగ భృతిపై చర్చ జరగాలి అని అన్నారు ఆయన.

సొంత ఇంటి కల కేసీఆర్‌ హయాంలో నెరవేరదని, కేసీఆర్‌ మాటలు కోటలు దాటుతాయి, పనులు తంగేళ్లు దాటవంటూ హెద్దేవా చేశారు. రాష్ట్రంలో డబుల్ బెడ్ రూమ్ లు ఎవరికి ఇవ్వడం లేదని, పంట నష్టపోయిన రైతులకు ఒక్కరూపాయి కూడా ఇవ్వలేదని ఆయన మండిపడ్డారు. కేంద్రం ప్రవేశపెట్టిన ఫసల్ భీమా యోజన అమలు చేయడం లేదని, నష్టపరిహారం ఇవ్వాలని హైకోర్టుకు రైతులు పోతే డబ్బులు ఇవ్వమని సుప్రీంకోర్టు కు పోయారన్నారు ఈటల రాజేందర్‌. నోటిఫికేషన్ లు ఇస్తే పేపర్ లీకేజీ చేస్తారని, ఇప్పటివరకు 17 పేపర్లు లీకేజీ అయ్యాయన్నారు ఈటల రాజేందర్‌. చదువుకున్నోళ్లకు ఉద్యోగం రావడం లేదు.. పైరవీలకే ఉద్యోగాలు వస్తున్నాయని, టీఎస్సీఎస్సీలో అన్ని అక్రమాలే అని ఆయన ధ్వజమెత్తారు.

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version