వైసీపీ వర్సెస్ జనసేన మధ్య వార్ చోటుచేసుకుంది. వైయస్సార్ వర్ధంతి బ్యానర్లపై పవన్ కళ్యాణ్ పుట్టినరోజు ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. దీంతో రెండు వర్గాల మధ్య గొడవ నెలకొంది. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం రింగ్ సెంటర్లో జనసేన పార్టీ కార్యకర్తలు కాస్త ఓవరాక్షన్ చేశారు.

జనసేన కార్యకర్తల హడావిడిని వైసీపీ శ్రేణులు కూడా అడ్డుకున్నాయి. కార్యక్రమం ముగించుకుని వెళ్దామని చెప్పినప్పటికీ… వైయస్ రాజశేఖర్ రెడ్డి బ్యానర్ పైన పవన్ కళ్యాణ్… పుట్టినరోజు బ్యానర్లు కట్టి శుభాకాంక్షలు తెలిపారు. దీంతో వైసిపి వర్సెస్ జనసేన కార్యకర్తల మధ్య గొడవ నెలకొంది. దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.
వైఎస్సార్ వర్ధంతి బ్యానర్లపై పవన్ ఫ్లెక్సీలు
ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం రింగ్ సెంటర్లో @JanaSenaParty కార్యకర్తల ఓవరాక్షన్
జనసేన కార్యకర్తల హడావిడిని అడ్డుకున్న @YSRCParty శ్రేణులు
కార్యక్రమం ముగించుకొని వెళ్తామని చెప్పినా.. వైఎస్సార్ బ్యానర్ పైన @PawanKalyan… pic.twitter.com/xf5hZjkTt0
— Telugu Feed (@Telugufeedsite) September 2, 2025