స్నేహాన్ని మరోసారి నిరూపించుకున్న పవన్ కళ్యాణ్..!

-

ప్రస్తుతం పవన్ కళ్యాణ్ , సుజిత్ కాంబోలో రాబోతున్న ఓజీ సినిమాకు సంబంధించి పూజా కార్యక్రమాలు ఘనంగా జరిగిన విషయం తెలిసిందే. ఇండస్ట్రీలో ఉన్న బడా నిర్మాతలు, డైరెక్టర్లు ఈ కార్యక్రమానికి హాజరై సక్సెస్ చేశారు. అయితే ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారిలో ఒకరి పేరు మాత్రం చాలా వైరల్ అవుతుంది. అదే ఆయన పాత స్నేహితుడు చాలా కాలం తర్వాత గుర్తుపెట్టుకుని మరి పవన్ తన ప్రాత స్నేహితుడిని ఈ కార్యక్రమానికి పిలిచినట్లు తెలుస్తోంది.. అయితే ఒకపక్క ఈ విషయాన్ని పవన్ కళ్యాణ్ అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు.. ఆయన ఎవరో కాదు ప్రముఖ రైటర్ కోన వెంకట్.. అసలు వారి మధ్య ఏం జరిగింది? ఎందుకు అలా మాట్లాడుతున్నారు ? అనేది ఇప్పుడు చూద్దాం.

రైటర్ కోన వెంకట్ కి చాలా మంచి పేరు ఉంది. ఎన్నో అద్భుతమైన సినిమాలకు రైటర్ గా పనిచేశారు. పవన్ కళ్యాణ్ అంటే వీరాభిమానం.. పవన్ నా స్నేహితుడు అని కోన వెంకట్ చాలా సందర్భాలలో వెల్లడించిన విషయం తెలిసిందే. అయితే కోన వెంకట వైసీపీలో చేరడం ఆ సమయంలో పవన్ ఫ్యాన్స్ ఎంతో ఆగ్రహం కూడా వ్యక్తం చేశారు. మిత్రుడు అని చెప్పిన పవన్ ని ప్రశ్నించడం విమర్శించడం చూసి జీర్ణించుకోలేకపోయారు. తర్వాత వాళ్ళిద్దరూ కలిసిన సందర్భాలు కూడా పెద్దగా లేవు. చాలా గ్యాప్ తర్వాత ఇద్దరూ ఈ సినిమా కార్యక్రమంలో కలిసి కనిపించేసరికి కొంతమంది పవన్ కళ్యాణ్ అభిమానులు ఈ విషయాన్ని జీర్ణించుకోలేకపోతూ ఉండడం గమనార్హం.

ఒక రకంగా చెప్పాలి అంటే ఇక్కడ కోన వెంకట్ ని తప్పుపట్టాల్సిన అవసరం లేదు. స్నేహం వేరు.. రాజకీయ ఉద్దేశాలు, ఆలోచనలు వేరు. అతను రాజకీయపరంగా మాత్రమే.. వ్యక్తిగత అభిప్రాయాలను వ్యక్తపరిచాడు. రాజకీయ వ్యాఖ్యలకు వ్యక్తిగత జీవితానికి ముడి పెట్టాల్సిన అవసరం లేదని మరి కొంతమంది చెప్పుకొస్తున్నారు. పవన్ కళ్యాణ్ మాత్రం ఎన్ని జరిగినా తన మిత్రుడిని దూరం చేసుకోకుండా ఇలా ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పిలిచినట్లు తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version