శ్రీలంక పరిస్థితులు ఏపీలో వచ్చే ప్రమాదం ఉందని.. అలా రాకూడదని కోరుకుంటున్నా అని పవన్ కళ్యాణ్ అన్నారు. రాజకీయం అంటే బుతుల పురాణం ఐపోయింది…యదా రాజా తథా ప్రజా సిద్దాంతం మారి పోవాలని కోరారు. యదా ప్రజా తథా రాజా పాలన రావాలి ..మంచి ప్రజలు మంచి పాలకులను ఎన్నుకోవాలని పిలుపు ఇచ్చారు.
నా భవిష్యత్ గురించి నాకు భయం లేదు…ఈ సమాజం ఏం అవుతుందో అన్న భయమే నాకు ఎక్కువ అన్నారు. భాధ్యత లేని వ్యక్తులు రాజకీయాల్లో ఉంటుంటే తట్టుకోలేక రాజకీయాల్లోకి వచ్చాను…ఈ పోరాటం లో పోతే నా ప్రాణం పోతుందని సంచలన వ్యాఖ్యలు చేశారు.
లేదంటే ఈ సమాజానికి మేలు జరుగుతుంది….వచ్చే ఎన్నికలు చాలా కీలకమైనవన్నారు. వచ్చే ఎన్నికల్లో జనసేన ఓ బలమైన రాజకీయ శక్తి గా ఆవిర్భావం చెందుతుంది…..సంక్షేమ పథకాలకు నేను వ్యతిరేకం కాదు..కానీ సంక్షేమం పేరుతో మనల్ని వైకల్యం బాట పట్టిస్తున్నారన్నారు. రాజకీయాలలో అనుభవం లేక పోతే వైసీపీ పాలన లాగా ఉంటుంది…పదవి కోసం మనం వెంపర్లాడటం కాదు.. పదవే మనల్ని వెతుక్కుంటూ రావాలని తెలిపారు.