పవన్ కళ్యాణ్: “టీడీపీ – జనసేన – బీజేపీ” కలిసే పనిచేస్తాయి … సీఎం ఎవరైతే ఏంటి !

-

ప్రస్తుతం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎన్డీఏ మీటింగ్ లో పాల్గొనడానికి ఢిల్లీ వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా మీడియా ముఖంగా పవన్ కళ్యాణ్ రాజకీయ పొత్తుల గురించి కీలక వ్యాఖ్యలు చేశాడు. ఈయన మాట్లాడుతూ ఆంద్రప్రదేశ్ లో 2024 లో జరగనున్న ఎన్నికలలో టీడీపీ బీజేపీ మరియు జనసేన పార్టీలు కలిసి పోటీ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని కంఫర్మ్ చేశారు. జగన్ ప్రభుత్వాన్ని ఓడించడానికి అందరూ కలిసి పనిచేసి ప్రతిపక్షములో కూర్చోబెడుతాము అంటూ వ్యాఖ్యలు చేసాడు పవన్. ప్రస్తుతం టీడీపీ మరియు బీజేపీ ల మధ్యన చిన్నపాటి అవగాహనా సమస్య ఉంది. ఇంతకు ముందు మేము ముగ్గురం కలిసి పనిచేశాము, కానీ ఆ తర్వాత కొన్ని సమస్యల వలన విడిపోవలసి వచ్చింది. ఇప్పుడు బీజేపీ మరియు జనసేనలు కలిసి ఉన్నాయి, వచ్చే ఎన్నికల్లో టీడీపీ ని కూడా మాతో నడిపించి వైసీపీని ఓడించి తీరుతాము అంటూ పవన్ కళ్యాణ్ మాట్లాడారు.

మాలో ఎవరు సీఎం అయినా మాకు సమస్య ఏమీ కాదు. కానీ నన్ను సీఎంగా చూడాలని నా పార్టీ జనసైనికులు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు అంటూ చెప్పాడు పవన్.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version