అమరావతి : రిపబ్లిక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ వేదికగా పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారాన్ని రేపిన సంగతి తెలిసిందే. పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలతో… ఏపీ రాజకీయాలు వేడేక్కాయి. ఒకరిపై మరోకరు మాటలు దాడులు కూడా చేసుకుంటున్నారు. ఇక తాజాగా మరోసారి జన సేన అధినేత పవన్ కళ్యాణ్.. ట్విట్టర్ వేదికగా మరోసారి ఓ రేంజ్ లో రెచ్చిపోయారు. ఇదే ఆంధ్ర ప్రదేశ్ ప్రగతి అంటూ వైసీపీ సర్కార్ పై విరుచుకు పడ్డారు.
హిందూ దేవాలయాలు, హిందూ దేవతా మూర్తుల విగ్రహాలపై వైసీపీ పాలనలోనే అనేక దాడులు జరిగాయని నిప్పులు చెరిగారు. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 140 దాడులు, విధ్వంసాలు వైసీపీ పాలనలోనే చోటు కున్నాయని ఫైర్ అయ్యారు పవన్ కళ్యాణ్. వై. సి. పి . పాలన లో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం లో ఈ రెండున్నర ఏళ్లలో జరిగిన ప్రగతి ఇదే అంటూ చురకలు అంటించారు పవన్.
దాడులకు పాల్పడిన దోషులంతా క్షేమంగా ఉన్నారంటూ ట్వీట్ చేశారు. అంతే కాదు ఎక్కడున్నాయి వై.సి.పి. గ్రామ సింహాలు ? అంటూ పవన్ కళ్యాణ్ ఫైర్ అయ్యారు. ఇక అంతకు ముందు ట్వీట్ లో “వైసీపీ ప్రభుత్వం ‘పాలసీ ఉగ్రవాదం’ కి అన్నీ రంగాలు అన్ని వర్గాలు నాశనం అయిపోతున్నాయి. దీనిని ఎదుర్కోవలిసిన సమయం ఆసన్నమయింది..” అంటూ మండిపడ్డారు. ఇక తాజా గా పవన్ చేసిన ట్వీట్ పై వైసీపీ ఎలా స్పందిస్తుందో చూడాలి.
ఇదే ఆంధ్రప్రదేశ్ ప్రగతి!
హిందూ దేవాలయాలు, హిందూ దేవతామూర్తుల విగ్రహాలపై ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 140 దాడులు, విధ్వంసాలు. వై.సి.పి. పాలనలో ఆంధ్రప్రదేశ్ లో ఈ రెండున్నర ఏళ్లలో జరిగిన ప్రగతి ఇదే! దాడులకు పాల్పడిన దోషులంతా క్షేమం.
ఎక్కడున్నాయి వై.సి.పి. గ్రామ సింహాలు? pic.twitter.com/cbfX4hI7bK— Pawan Kalyan (@PawanKalyan) September 28, 2021