డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిన్న కొడుకు మార్క్ శంకర్ సింగపూర్‌లో చదువుతున్న పాఠశాలలో అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో పవన్ తనయుడు ‘మార్క్ శంకర్’ కాళ్ళు, చేతులకు గాయాలైనట్లు సమాచారం. దట్టమైన పొగ కారణంగా లంగ్స్‌లోకి పొగ వెళ్లగా బాబు తీవ్ర ఇబ్బందులకు గురైనట్లు తెలిసింది. వెంటనే ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు సమాచారం.

విషయం తెలియడంతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సింగపూర్‌కు బయలు దేరినట్లు తెలుస్తోంది. మన్యం పర్యటన ముగించుకుని విశాఖ నుంచి నేరుగా స్పెషల్ విమానంలో పవన్ సింగపూర్‌కు చేరుకోనున్నారు. తన చిన్నకొడుకు ఏ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నాడో నేరుగా అక్కడే పవన్ వెళ్లనున్నట్లు విశ్వసనీయ వర్గాల సంచారం.కాగా, పవన్ కొడుకు కోలుకోవాలని సీఎం చంద్రబాబు, చిరంజీవి, బండి సంజయ్ వేదికగా స్పందించారు.