ఫైనల్ గా మహేష్ బాబుని దాటేసిన పవన్ కళ్యాణ్..!

-

సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానులు మహేష్ బాబు ని ఎప్పటికప్పుడు ట్రెండ్ చేయడానికి ప్రయత్నం చేస్తూనే ఉంటారు. ఇకపోతే సాధారణంగా ఏ స్టార్ హీరో బర్త్డే వస్తున్న ఆ స్టార్ హీరో సినిమాలకు సంబంధించి అప్డేట్లను వదులుతూ ఉంటారు . కానీ ఇటీవల మహేష్ బాబు సినిమా ఏది రాకపోవడంతో అభిమానులు కాస్త డిఫరెంట్ గా ఆలోచించి మహేష్ బాబు పోకిరి సినిమాను రీ రిలీజ్ చేసి రూ.1.5 కోట్ల కలెక్షన్ అందుకుని రికార్డు సృష్టించారు. ఇకపోతే మెగాస్టార్ అభిమానులు కూడా అదే పద్ధతిని ఫాలో అయ్యి చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా చిరంజీవి నటించిన ఘరానా మొగుడు సినిమాను రీరిలీస్ చేసి ప్రేక్షకులను ఆనందింప చేశారు కానీ రూ.20 లక్షలు మాత్రమే వసూలు చేసి ఈ సినిమా పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేదు.

మహేష్ బాబు సాధించిన రికార్డులను ఎవరు బ్రేక్ చేయలేరు అని ఆలోచిస్తుండగానే పవన్ కళ్యాణ్ అభిమానులు కూడా అదే పద్ధతిలో వినూత్నంగా ఆలోచించి పవన్ కళ్యాణ్ కెరియర్ లో బ్లాక్ బస్టర్ గా నిలిచిన జల్సా సినిమాను ప్రపంచవ్యాప్తంగా రీరిలీజ్ చేశారు. ఇక అంతేకాదు ఈ సినిమా భారీగా 500 కు పైగా ప్రపంచ వ్యాప్తంగా షో స్ నమోదు చేసుకుంది. ఇక ఊహించని విధంగా జల్సా సినిమా రూ.2.85 కోట్ల వసూళ్ళ ను అందుకొని రీ రిలీజ్ క్యాటగిరి లోనే ఆల్ టైం రికార్డును క్రియేట్ చేసిందని చెప్పవచ్చు. ఇక దీన్ని బట్టి చూస్తే ప్రపంచవ్యాప్తంగా పవన్ కళ్యాణ్ కు ఏ రేంజ్ లో అభిమానులు ఉన్నారో అర్థం చేసుకోవచ్చు. అంతే కాదు మహేష్ బాబు రికార్డును బ్రేక్ చేశాడు పవన్ కళ్యాణ్.Re-Release Trend: A Factor Of Joy or Cry?పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా జల్సా సినిమాను శుక్రవారం రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా రిలీజ్ చేయగా భారీ రెస్పాన్స్ లభించింది. అమెరికాలో కూడా ఒక రేంజ్ లో రెస్పాన్స్ రావడంతో పవన్ కళ్యాణ్ అభిమానుల హడావిడి అంతా కాదు. ఇకపోతే పవన్ కళ్యాణ్ వరుస సినిమాలు చేయకపోయినప్పటికీ స్టార్ స్టేటస్ ని సొంతం చేసుకోవడం హర్షదాయకం.

Read more RELATED
Recommended to you

Latest news