ఏపీ నిర్మాణ కార్మికుల తరపున వైసీపీ ప్రభుత్వానికి పవన్ విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో 22 లక్షల మంది రిజిస్టర్డ్ నిర్మాణ కార్మికులు ఉన్నారని, మొదట ఇసుక కొరత ఉంది, తరువాత కోవిడ్ 19, ఇప్పటివరకు నిర్మాణ రంగ కార్మికులకు ప్రభుత్వ మద్దతు జీరో అని పవన్ పేర్కొన్నారు. ఈ ప్రభుత్వం కార్మికులను, వారి కష్టాలను పట్టించుకోదన్న ఆయన కార్మికులను సమస్యలు పరిచ్కరించాల్సిన ప్రభుత్వమే వారి సంక్షేమ నిధులను మళ్లించడం విడ్డూరమని అన్నారు.
ఏపీ కన్స్ట్రక్షన్ వర్కర్స్ వెల్ఫేర్ ఫండ్ యొక్క 450 కోట్లు వైయస్ఆర్సిపి ప్రభుత్వం తన సొంత ఉపయోగం కోసం మళ్లించిందని పవన్ ఆరోపించారు. కన్స్ట్రక్షన్ వర్కర్స్ ట్రేడ్ యూనియన్ను కూడా సంప్రదించకుండా 450 కోట్ల రూపాయల విలువైన ఈ నిధులను మళ్లించడానికి రాష్ట్ర ప్రభుత్వానికి ఏ అధికారం ఉంది అని ప్రశ్నించారు. ఇది కార్మికుల హక్కుల దుర్వినియోగపరచడం, కార్మిక చట్టాల ఉల్లంఘనతో పాటు రాజ్యాంగ విరుద్ధమని ఆయన పేర్కొన్నారు. ఈ అంశంపై వైసిపి ప్రభుత్వం పునరాలోచన చేసి కార్మికులను ఆదుకుంటుందని నేను ఆశిస్తున్నానని పవన్ పేర్కొన్నారు.