రాష్ట్రంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర పేరుతో కొంచెం ఎక్కువగానే హడావిడి చేస్తున్నాడు. ముఖ్యంగా సీఎం జగన్ ను టార్గెట్ గా చేసుకుని చేస్తున్న వ్యాఖ్యలు బాగా వైరల్ అవుతున్నాయి. ఒక సినీ నటుడు రాజకీయ నాయకుడిగా మారితే ఎంత సినీ పొలిటిషన్ గా మాట్లాడగలడో నిరూపిస్తున్నాడు. తాజాగా మరోసారి సీఎం జగన్ పై పవన్ కళ్యాణ్ విమర్శలు చేశాడు. ఈయన మాట్లాడుతూ.. ఈ రాష్ట్రము జగన్ అనే జలగ బాగా ఇబ్బంది పెడుతోంది. ఎన్నడూ లేని విధంగా ఆంధ్రప్రదేశ్ లో అవినీతిని మరియు అరాచకాన్ని చాలా పెద్ద స్థాయికి తీసుకెళ్లిన ఘనత జగన్ రెడ్డికి దక్కుతుందని సెటైరికల్ గా మాట్లాడారు. మీరందరూ అనుకుంటున్నట్లు జగన్ నాకేమీ శత్రువు కాదని క్లారిటీ ఇచ్చారు, నాకు శత్రువుగా మారే అంత సీన్ లేదన్నాడు. ఈ కామెంట్ వైసీపీని బాగా వేడెక్కిస్తుంది అని చెప్పాలి.
ఈ రాష్ట్రాన్ని జగన్ వదిలివేయాలని అప్పటి వరకు నా ఈ పోరాటం జలగ రెడ్డిపైన సాగుతూనే ఉంటుందన్నారు పవన్ కళ్యాణ్. ఇంకా జగన్ పాలనను బ్రిటిష్ పాలనతో పోల్చాడు.