బాబు బటన్ నొక్కితేనే పవన్ మాట్లాడతారు : సజ్జల రామకృష్ణారెడ్డి

-

వచ్చేనెల మే 13వ తేదీన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్నాయి. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఒకరిపై మరొకరు రాజకీయ నాయకులు విమర్శలు చేసుకుంటున్నారు. తాజాగా జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ పై ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.

పవన్ కళ్యాణ్ కి ఏ కోశానా నాయకుడి లక్షణాలు లేవని సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శించారు. ‘చంద్రబాబు కోసమే పవన్ పుట్టి పెరిగినట్లు ఉంది అని తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ఒక పార్టీ అధ్యక్షుడిలా ఆయన వ్యవహరించడం లేదు. బాబు బటన్ నొక్కితేనే పవన్ మాట్లాడతారు. కాపుల హక్కుల కోసం ఆయన ఏనాడైనా నోరువిప్పారా? అని ప్రశ్నించారు. సీఎం జగన్ను ఒంటరిగా ఎదుర్కోలేకే కూటమిగా వస్తున్నారు. జగన్ ఓ వైపు.. గుంటనక్కలు మరో వైపు’ అని ఆయన మండిపడ్డారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version