జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఢిల్లీ పర్యటన కొనసాగుతుంది. ఆదివారం మధ్యాహ్నం ఉన్నట్టుండి ఢిల్లీ వెళ్ళిన జనసేనాని ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ కి తిరిగి రాలేదు. బిజెపి పెద్దలతో సమావేశమయ్యే ప్రయత్నాల్లో ఉన్న ఆయన బిజెపి వర్కింగ్ ప్రెసిడెంట్ జెపి నడ్డాను కలిసిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన రాష్ట్ర పరిస్థితులపై చర్చించారు. రాష్ట్ర రాజధానిగా అమరావతిని కొనసాగించే విధంగా,
కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని నడ్డాను పవన్ కళ్యాణ్ కోరారు. ఇక ఇదే సమయంలో ఆయన ప్రధాని నరేంద్ర మోడీ సహా కేంద్ర హోం మంత్రి అమిత్ షా ని కలవడానికి ప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచారం. ముఖ్యంగా వారి వద్ద రాష్ట్ర ప్రభుత్వ తీరుపై ఫిర్యాదు చెయ్యాలని పవన్ భావిస్తున్నారు. అయితే నడ్డాతో జరిగిన భేటీలో పవన్ అనుకున్నవి జరగలేదని అంటున్నారు. పవన్ ఎం చెప్పినా సరే,
నడ్డా నుంచి అమిత్ షా తో మాట్లాడాలి అనే సమాధానమే వచ్చింది. దీనితో పవన్, అమిత్ షా ను కలవడానికి ఢిల్లీలోనే ఉన్నట్టు తెలుస్తుంది. ప్రధాని నరేంద్ర మోడీ లేదా అమిత్ షా ను ఎలాగైనా కలవాలి అని ఢిల్లీ నుంచి రాకుండా పవన్ ఆగిపోయారు. మంగళవారం వారిని కలిసే అవకాశం ఉందని అంటున్నారు. పవన్ ఢిల్లీ పర్యటన మీద ఆశలు పెట్టుకున్న కొందరికి అది ఆశించిన ఫలితాలు ఇవ్వలేదని అంటున్నారు కొందరు.