పవన్ హీరోయిన్ ఏంటి ఇలా మారిపోయింది..?

-

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ప్రత్యేకంగా పరిచయం అవసరం లేని పేరు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. ఈయన సినిమాలు బాలీవుడ్ లో విడుదల కాకపోయినప్పటికీ దేశవ్యాప్తంగా మంచి ప్రేక్షకాదరణ పొందాడు. ఇకపోతే ఈయన నటించిన సినిమాల ఫలితాలు ఎలా ఉన్నప్పటికీ అభిమానులు ఈయన సినిమాలను సూపర్ హిట్ చేస్తారని చెప్పడంలో సందేహం లేదు. ముఖ్యంగా సూపర్ హిట్స్ కొట్టడం పవన్ కళ్యాణ్ కు వెన్నతో పెట్టిన విద్య అని చెప్పాలి. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ స్టైల్ కి ఫిదా కానీ ప్రేక్షకులు ఉండరేమో.

పవన్ కళ్యాణ్ స్టైలిష్ లుక్ కు నిదర్శనంగా చెప్పుకునే సినిమాలలో బాలు సినిమా కూడా ఒకటి. ఏ. కరుణాకరన్ దర్శకత్వంలో తెరకెక్కిన బాలు సినిమాలో పవన్ కళ్యాణ్ సరసన ఇద్దరు హీరోయిన్లుగా నటించారు అందులో ఒకరు శ్రియ కాగా మరొకరు నేహా ఒబెరాయ్.. ప్రస్తుతం శ్రియ గురించి, ఆమె అందం గురించి అందరికీ తెలిసిందే. కానీ నేహా ఎక్కడ ఉంది? ఎలా ఉంది? అనేది మాత్రం చాలా మందికి తెలియదనే చెప్పాలి. నేహా తండ్రి ఎవరో కాదు ప్రముఖ బాలీవుడ్ నిర్మాత ధరమ్ ఒబెరాయ్.. ఆయన వారసురాలిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన నేహా ఇప్పటికీ కూడా తన అందంతో ప్రశంసలు పొందుతోంది.

ఆ తర్వాత జగపతిబాబు హీరోగా నటించిన బ్రహ్మాస్త్రం సినిమాలో హీరోయిన్గా నటించే అవకాశం దక్కించుకుంది. కానీ ఈ సినిమా డిజాస్టర్ గా మారిపోయింది. ఇక ఆ తర్వాత తెలుగులో నటించకుండా బాలీవుడ్ కి సెటిల్ అయినా ఈమె 2010లో ప్రముఖ వజ్రాల వ్యాపారి విశాల్ షా ను వివాహం చేసుకున్న ఈమె ప్రస్తుతం తన భర్త వ్యాపార కార్యకలాపాలను చూసుకుంటుంది.

ఇకపోతే తాజాగా తనకు సంబంధించిన లేటెస్ట్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయగా ఈమె అందం చూసి ప్రతి ఒక్కరు ఆశ్చర్యపోతున్నారు. అప్పటికి ఇప్పటికీ ఈమెలో ఎన్నో మార్పులు వచ్చినా సరే అందంలో మాత్రం తగ్గలేదు అంటూ తెగ కామెంట్లు చేస్తున్నారు. నిజానికి అప్పటికంటే ఇప్పుడే మరింత గ్లామర్ గా మారిపోయింది ఈ ముద్దుగుమ్మ.

Read more RELATED
Recommended to you

Exit mobile version