పవన్ అభిమానులకు గుడ్‌న్యూస్.. ఇక తగ్గేదిలేదట?

-

పవర్ స్టార్ అభిమానులకు గుడ్ న్యూస్. చాలా అవాంతరాలతో ఆగిపోయిన పవన్ సినిమాలు మళ్లీ పట్టాలెక్కనున్నాయి. పవన్‌కల్యాణ్‌ హీరోగా హరీశ్‌ శంకర్‌ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ‘పీఎస్‌పీకే 28’ ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ అంటూ ఫ్యాన్‌మేడ్‌ పోస్టర్‌ ఒకటి సోమవారం సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేసింది. అయితే ఈ విషయంపై నిర్మాణ సంస్థ మైత్రీ మూవీమేకర్స్‌ ట్విట్టర్‌ వేదికగా స్పష్టత ఇచ్చింది. పవన్‌ 28వ సినిమా ఫస్ట్‌లుక్‌, టైటిల్‌ ఈ ఏడాది ఉగాది రోజున విడుదల చేస్తామని చెప్పారు. సినిమాకు సంబంధించి ఏ విషయమైనా తమ అధికారిక సోషల్‌ మీడియా ఖాతా ద్వారా వెల్లడిస్తామని తెలిపారు.

ఇక చాలా రోజులుగా అప్ కమింగ్ ప్రాజెక్టులపై అప్‌డేట్స్ లేక టెన్షన్ పడుతున్న పవన్ భిమానులకు తాజాగా గుడ్ న్యూస్ వినిపిస్తోంది. క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘హరి హర వీరమల్లు’ సినిమా‌తో పాటు సాగర్ కె.చంద్ర తో చేస్తున్న ‘అయ్యప్పనుమ్ కొశీయుమ్’ రీమేక్లు కూడా త్వరలోనే పట్టాలెక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. లాక్డౌన్, అలాగే స్వయంగా తానే కరోనా బారినపడటంతో ఈ సినిమాలు నిలిచిపోయాయి. ఇప్పుడన్నీ సెట్ అయ్యేలా ఉన్నాయి. ఇటీవలే కరోనా నుంచి కోలుకున్న పవన్.. వీలైనంత త్వరగా ఈ సినిమాలను పూర్తి చేయాలని భావిస్తున్నారట.

ఆగస్ట్ నుంచి తిరిగి సెట్స్‌లో అడుగుపెట్టాలని నిర్ణయించుకున్న పవన్.. ‘ఏకే’ రీమేక్‌తో పాటు సమాంతరంగా ‘వీరమల్లు’ షూటింగ్ కూడా చేసేలా షెడ్యూల్స్ ప్లాన్ చేసుకుంటున్నారట. అయితే ముందుగా ఏకే చిత్రాన్ని కంప్లీట్ చేయాలనుకుంటున్నారట. ఇప్పటికే 40 శాతానికి పైగా షూటింగ్ జరుపుకున్న ఈ చిత్రంలో రానా దగ్గుబాటి కూడా నటిస్తున్నారు. ఈ సినిమాకి త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటలు – స్క్రీన్ ప్లే అందిస్తున్నారు.

ఇక పవన్ కెరీర్ లో మొదటి పీరియాడికల్ మూవీగా తెరకెక్కుతున్న ‘హరి హర వీరమల్లు’ సినిమా షూటింగ్ కూడా 45 శాతం పూరైంది. దీని కోసం ఆల్రెడీ ఉన్న సెట్స్‌తో పాటుగా మరికొన్ని భారీ సెట్స్ నిర్మాణం చేయాల్సి ఉందట. అందుకే ముందు ‘ఏకే’ రీమేక్ ని కంప్లీట్ చేసి.. ‘వీరమల్లు’ని సంక్రాంతికి రెడీ చేసేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారని టాక్ వినిపిస్తోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version