గత పార్లమెంట్ ఎన్నికల సమయంలో ఎలక్షన్ల నిర్వహణకు సంబంధించిన పెండింగ్ బిల్లులను విడుదల చేయాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు. సంవత్సరం గడిచిన ఇంతవరకూ బిల్లులు విడుదల చేయకుండా తమను ఇబ్బందులకు గురిచేస్తున్నారని నిర్వాహకులు ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ క్రమంలోనే శనివారం మంచిర్యాల జిల్లా చెన్నూర్ పట్టణంలో పార్లమెంట్ ఎన్నికల సమయంలోని బిల్లులను చెల్లించాలని, ఎన్నికల రిటర్నింగ్ అధికారి చంద్రకళ కారుకు అడ్డుగా పడుకొని బాధితులు నిరసన తెలిపారు. ఇప్పటికైనా బిల్లులు వెంటనే విడుదల చేయాలని కోరారు.బిల్లులు
రాకపోవడంతో అప్పులు చెల్లించలేక ఇబ్బందులు పడుతున్నామని బాధితులు వాపోయారు. ఈ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.