జగిత్యాల జిల్లాలో మున్సిపల్ కార్మికులు ఆందోళన బాట పట్టారు. తమకు పెండింగ్ జీతాలు వెంటనే చెల్లించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. శనివారం ఉదయం మెట్ పల్లి మున్సిపల్ ఆఫీసు ఎదుట వారు బైఠాయించి నిరసన తెలిపారు.
సమయానికి జీతాలు రాక సరుకులు కొనే పరిస్థితి లేదని ఆవేదన వ్యక్తం చేశారు.పెండింగ్ జీతాలతో పాటు ఏడు నెలల పీఆర్సీ వెంటనే ఇవ్వాలని వారు డిమాండ్ చేస్తున్నారు. జీతాలు రాక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని.. ప్రభుత్వానికి తమ ఇబ్బందులు తెలియజేసేందుకు కూరగాయల మార్కెట్లో భిక్షాటన చేస్తూ వారు నిరసన ప్రదర్శన చేపట్టారు. కాగా, మున్సిపల్ కార్మికులకు జీతాలు రాకపోవడంపై ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నాయి.