Telangana: పోలీసు వాహనాలపై రూ.68.67 లక్షల పెండింగ్ చలాన్లు !

-

తెలంగాణ పోలీస్ వాహనాల చలాన్ల విషయంలో షాకింగ్ నిజాలు బయటపడ్డాయి. చలాన్లు వేసే పోలీస్ అధికారులే… చలాన్ కట్టడం లేదు. పోలీస్ వాహనాలపై ఏకంగా 17,391 చలాన్లు ఉన్నాయి. అంటే దాదాపు 68.67 లక్షల పెండింగ్ చాలా డబ్బులు… తెలంగాణ పోలీసు వాహనాల ద్వారా రావాల్సి ఉంది.

17,391 challans on police vehicles.. Rs.68.67 lakhs pending challan money

ట్రాఫిక్ నిబంధనాలను ఉల్లంఘించే వాహనదారులకు చలాన్లు వేస్తూ… అధికారులే నిబంధనలు ఉల్లంఘిస్తున్నారు. పోలీస్ వాహనాల పెండింగ్ చాలాన్లపై లోకేంద్ర సింగ్ అనే వ్యక్తి ఆర్టిఐ ద్వారా అసలు బాగోతాన్ని బయటపెట్టారు. వెంటనే ఈ 68 లక్షల పెండింగ్ చాలాన్లు పోలీసులు కట్టాల్సిందేనని.. అతను డిమాండ్ చేస్తున్నారు.

సామాన్య ప్రజల పైన చలాన్లు వేసి రక్తం పీల్చుతున్న పోలీసులు… మీరే ఇప్పుడు ఈ చలాన్లు కట్టకపోతే ఎలా అని నిలదీస్తున్నారు జనాలు. ఈ విషయంపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించి వెంటనే చర్యలు తీసుకోవాలని కూడా డిమాండ్ చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news