డిజిటల్ సంస్థ పేటియం సీఈవో విజయ్ శేఖర్ శర్మ అరెస్ట్ అయ్యారు. విజయ్ శేఖర్ శర్మ ను ఢిల్లీ పోలీసులు ఫిబ్రవరి నెలలో అరెస్టు చేశారు. అయితే కాసేపటి క్రితమే ఆయన బెయిల్ పై విడుదలయ్యారు. ఈ ఘటన గత నెల 22వ తేదీన చోటు చేసుకోగా… చాలా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నిర్లక్ష్యంగా కారు నడిపి మరో వాహనాన్ని ఢీ కొట్టిన కేసులో పేటీఎం సీఈఓ విజయ్ శేఖర్ శర్మ ను పోలీసులు అరెస్టు చేశారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… ఫిబ్రవరి 22వ తేదీన తన జాగ్వార్ ల్యాండ్ రోవర్ కారు లో ప్రయాణిస్తున్న విజయ్ శర్మ… వేగంగా వచ్చి డిసిపి మేరీ కారును ఢీ కొట్టారు. ఈ ఘటన మదర్ ఇంటర్నేషనల్ స్కూల్ సమీపంలో చోటు చేసుకుంది. అయితే విజయ్ వెంటనే అక్కడి నుంచి వెళ్లిపోయినట్లు ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు పోలీసులు. ఆ సమయంలో డిసిపి కారు పెట్రోల్ కొట్టించడానికి తీసుకెళ్తున్న డ్రైవర్ దీపక్ కుమార్… విజయ్ కారు నెంబరు రాసుకున్నాడు. ఈ నేపథ్యంలోనే వెంటనే పోలీసులు అతడిని అరెస్టు చేశారు. అయితే ఈ కేసులో ఇవాళ ఆయన బెయిల్ పై విడుదలయ్యారు.