బాబాయి హత్య, కోడి కత్తి కేసు మీద ఏమి పీకారు?..ఇదేం పీకుడు భాష అని జగన్ కు పయ్యావుల కేశవ్ కౌంటర్ ఇచ్చారు. పీకే ఇచ్చిన నివేదికలో తన ప్రభుత్వ పతనం అయింది అని సీఎం జగన్ కు తెలిసిందని.. బలంగా ఉన్నాను అనే ప్రయత్నం ముఖ్యమంత్రి చేశారని మండిపడ్డారు. తన బలహీత ను కప్పి పుచ్చుకోవడానికి పీకుడు భాష మాట్లాడుతున్నారని.. మూడేళ్లుగా ముఖ్యమంత్రి ఏమి పీకారని ప్రశ్నించారు.
ఢిల్లీ వెళ్లి సీఎం ఏమి పీకారు.. పికడానికి వెళ్ళారా? పీకించుకోవడానికి వెళ్ళారా అని నిలదీశారు. ముఖ్యమంత్రికి అర్ధం కావాలనే ఈ పీకుడు మాట్లాడాల్సి భాష వస్తుందని.. ఏమి పీకాలో, ఎలా పీకాలో ప్రజలు డిసైడ్ అయ్యారని చురకలు అంటించారు.
పీకెను పీకేసి మీరు పని చేయగలరా…రాయలసీమలో ఎంత మంది మంత్రులను పీకుతావో చూస్తామని మండిపడ్డారు. ప్రతిపక్షం ప్రజా సమస్యలు పై పోరాటం చేస్తుందని.. సీఎం ఇలాగే మాట్లాడితే శంకరగిరి మాన్యాలు కి పంపిస్తారని.. దిగజారుతున్న ప్రతిష్ట నుంచి ప్రజలు ను మరల్చడానికి ఈ వ్యాఖ్యలు చేస్తున్నారని ఆగ్రహించారు.
భాష మార్చుకోకపోతే ప్రజలు తొందరలోనే మార్చేస్తారని.. ముఖ్యమంత్రి పీకిన వాటి గురించి ఒక పుస్తకం, పికని వాటి గురించి పది పుస్తకాలు రాయొచ్చు అన్నారు.