గాంధీ భవన్ లో పీసీసీ కార్యవర్గ సమావేశం ప్రారంభమైంది. హాత్ సే హాత్ జోడో పాదయాత్రపై సన్నాహక సమావేశం జరుగుతోంది. పీసీసీ, డీసీసీ, అన్ని కమిటీల ఛైర్మన్ లు హాజరయ్యారు. ఈ సమావేశానికి సీనియర్ నాయకులు జానా రెడ్డి, మల్లు రవి, జనార్థన్ రెడ్డి తదితరులు హాజరయ్యారు. అసంతృప్తి వర్గం నేతలు ఈ భేటీకి డుమ్మా కొట్టినట్లు సమాచారం.
జనవరి 26 నుంచి రెండు నెలల పాటు దేశవ్యాప్తంగా ప్రియాంకా గాంధీ పాదయాత్ర చేయనున్నారు. ఈ యాత్రను తెలంగాణ నుంచే మొదలు పెట్టాలని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ప్రియాంకాను కోరారు. రేవంత్ కోరికను మన్నించిన ప్రియాంకా తెలంగాణలో ఒక రోజు పాదయాత్ర చేయడానికి అంగీకరించారు. ప్రియాంక రాష్ట్రం నుంచి పాదయాత్ర మొదలుపెట్టిన తర్వాత రేవంత్ ఆ యాత్రను రెండు నెలల పాటు కొనసాగించనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేసి కాంగ్రెస్ పార్టీని క్షేత్రస్థాయిలో పటిష్ఠం చేయనున్నారు.