పెద్దగట్టు జాతర.. విజయవాడ హైవే‌పై ట్రాఫిక్ ఆంక్షలు

-

పెద్దగట్టు జాతర సందర్భంగా భక్తులు, శివసత్తులు పెద్దఎత్తున లింగమంతుల స్వామి ఆలయం వద్దకు చేరుకుంటున్నారు. ‘ఓ లింగా ఓ లింగా’ అంటూ భక్తుల నామస్మరణతో ఆలయ ప్రాంగణం మారుమోగుతోంది.

అయితే, లింగమంతుల స్వామి పెద్దగట్టు జాతర ఆదివారం అర్ధరాత్రి నుంచి ప్రారంభమైంది. దేవరగట్టు గుట్టపైకి భక్తులు, శివసత్తులు చేరుకున్నారు. ఈ క్రమంలోనే భక్తులు ‘ఓ లింగా ఓ లింగా’ నామస్మరణతో స్వామి వారిని ప్రసన్నం చేసుకుంటున్నారు.దీంతో ఆలయ పరిసరాలు మార్మోగుతున్నాయి. జాతరలో శివసత్తుల నృత్యాలు అందరినీ ఆకట్టుకున్నాయి. కాగా, జాతర నేపథ్యంలో హైదరాబాద్ – విజయవాడ హైవేపై ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version