ఏపీ అటవీశాఖపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి బుధవారం సమీక్ష నిర్వహించారు. తిరుపతి, విశాఖ జూపార్క్ల అభివృద్ధిపై ప్రధానంగా చర్చ నిర్వహించారు. ప్రజలను ఆకర్షించే జంతువులను తీసుకువస్తామని మంత్రిఅన్నారు. దేశంలోని ఇతర జూపార్క్‌లతో జంతువుల ఎక్స్చేంజ్ చేయాలని ఆదేశించారు. కపిలతీర్థం నుంచి జూపార్క్ వరకు మెమో ట్రైన్ ఏర్పాటు చేయాలని… తిరుపతిలోని బయోట్రిమ్ ద్వారా రైతులకు మేలుజాతి మొక్కలు అందించాలని తెలిపారు. అటవీశాఖ పరిశోధన కేంద్రాలను బలోపేతం చేస్తామన్నారు. బయోడైవర్సిటీ బోర్డ్ ద్వారా అరుదైన జీవ, జంతుజాలాన్ని పరిరక్షిస్తామని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వెల్లడించారు.
అలాగే జామ్ నగర్‌లోని ప్రైవేటు జూలో ఉన్న జంతువులను కూడా ఎక్స్చేంజ్, లేదా కొనుగోలు ద్వారా కూడా సమీకరించుకోవచ్చని సూచించారు. దీనిపై వన్యప్రాణి విభాగం అధికారులు డిపిఆర్‌లు సిద్దం చేయాలని, నిర్ధిష్ట సమయంలోగా వాటిని అమలులోకి తీసుకురావాలని ఆదేశించారు. తిరుపతిలో కపిలతీర్థం నుంచి జూపార్క్ వరకు మెమో ట్రైన్‌ను ఏర్పాటు చేయడం ద్వారా జూపార్క్‌కు సందర్శకుల సంఖ్య పెరిగేలా చేయవచ్చని అన్నారు. వివిధ పరిశ్రమల నుంచి సిఎస్ఆర్ నిధుల ద్వారా సహకారాన్ని పొందాలని అన్నారు. తిరుపతి జూపార్క్‌లో వైట్ టైగర్ సఫారీపై ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆదేశించారు.