మరికాసేపట్లో పీవీ సింధు కాస్య పతక పోరు…

-

టోక్యో ఒలంపిక్స్ లో మన తెలుగు తేజం పీవీ సింధు మరో రసవత్తర పోరుకు సిద్ధమైంది. మరికాసేపట్లో చైనా సెట్లర్ జియావో తో పీవీ సింధు తలపడనుంది. ఈ మ్యాచ్ లో చైనా ప్లేయర్ జియావో పై గెలిస్తే… తెలుగు తేజం పీవీ సింధుకు కాస్య పతకం రానుంది.

గ్రూప్ దశ నుంచి అత్యుత్తమ ఆటతీరును కనబరిచిన పివి సింధు… అనూహ్యంగా సెమిస్ పోరులో ఓటమిపాలైంది. అయితే ఈ ఒలం పిక్స్ లో పతకం సాధించి పీవీ సింధు చరిత్ర సృష్టిస్తుందా? లేదా అనేది చూడాలి. ఒకవేళ ఈ మ్యాచ్ లో పీవీ సింధు గెలిస్తే… మరే భారత క్రీడాకారిని అందుకొని ఘనతను సాధించ నుంది. అటు పీవీ సింధు ప్రత్యర్థి జియావో… చాలా బలంగా కనిపిస్తోంది. జియావో పై పీవీ సింధు ట్రాక్ రికార్డు కూడా ప్రతికూల అంశంగా కనిపిస్తోంది. ఈ మ్యాచ్లో గెలిచి తీరాలన్న కసితో ఉన్న పివి సింధు… సెమీస్ తప్పిదాలు పునరావృతం కావద్దని భావిస్తోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version