అమరావతి : ఈ నెల 16వ తేదీ నుంచి స్కూళ్లను రీ-ఓపెన్ చేయనున్నట్లు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం మరోసారి కీలక ప్రకటన చేసింది. ఈ నెల 16 వ తేదీ నాటికి మొదటి విడత నాడు-నేడు పనులు పూర్తి చేయాలని ఈ మేరకు ఆంధ్ర ప్రదేశ్ విద్యా శాఖ ఆదేశాలు జారీ చేసింది. నాడు-నేడు పనుల పురోగతిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తోన్నారు విద్యా శాఖ ఉన్నతాధికారులు.
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా చురుగ్గా నాడు నేడు పనులు జరుగుతున్నాయి. ఆధునికీకరణతో ప్రభుత్వ స్కూళ్లకు న్యూ లుక్ వచ్చింది. అడ్మిషన్ల కోసం ప్రభుత్వ పాఠశాలలకు విద్యార్ధుల తల్లిదండ్రులు భారీ సంఖ్య లో వస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలలను కార్పోరేట్ తరహాలో తీర్చిదిద్దడంతో విద్యార్ధుల సంఖ్య పెరిగే అవకాశం ఉంటుందని ఆంధ్ర ప్రదేశ్ కు చెందిన ఉపాధ్యాయులు పేర్కొంటున్నారు. అటు స్కూళ్లల్లో.. అందరూ కరోనా నిబందనలు పాటించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. మాస్కులు, సామాజిక దూరం తప్పనిసరి చేసింది సర్కార్.