నిర్ణయించిన ఫీజుల కన్నా ఎక్కువ వసూలు చేస్తే జరిమానా – AFRC

-

తెలంగాణ ఇంజనీరింగ్ కాలేజీల్లో అధిక ఫీజుల వసూళ్లపై తెలంగాణ ఫీజ్ రెగ్యులేటరీ కమిటీ (AFRC) హెచ్చరికలు జారీ చేసింది. నిర్ణయించిన ఫీజుల కన్నా కాలేజీలు ఎక్కువ వసూలు చేస్తే జరిమానా విధిస్తామని హెచ్చరించింది AFRC. నిర్ణయించిన ఫీజు కంటే ఎక్కువ వసూలు చేయరాదు… G.O.Ms.No.37 సూచించిన ఫీజుల కన్నా ఏ రూపంలో ను ఇతర ఫీజులు తీసుకోరాదని స్పష్టం చేసింది. అదనంగా వసూలు చేస్తే 2 లక్షలు ఫైన్.. ఎంత మంది దగ్గర వసూలు చేస్తే అన్ని రెండు లక్షలు కాలేజిలు కట్టాలని.. అదనంగా వసూలు చేసిన ఫీజు విద్యార్థులకు చెల్లించాలని చెప్పింది.

బి-కేటగిరీ అడ్మిషన్ల కోసం ఎఎఫ్‌ఆర్‌సి ద్వారా కాలేజీలకు పేర్లు పంపిన విద్యార్థుల దరఖాస్తులు కాలేజీలకు అందడం లేదన్న ఫిర్యాదుల పై కమిటీ సీరియస్ అయింది. వారి కేసులు మెరిట్‌పై పరిగణించబడతాయా లేదా అనేది కమిటీ పరిశీలిస్తుందని తెలిపింది. ఆ దరఖాస్తులను ఆయా కాలేజీలు మెరిట్‌పై పరిగణించకపోతే చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.

ఎంపిక చేసిన జాబితా నుండి సమాన సంఖ్యలో విద్యార్థులను తొలగించడం ద్వారా వారిని మెరిట్ ఆధారంగా సీట్ల కేటాయింపు చేస్తామని.. AFRC ద్వారా దరఖాస్తులు ఫార్వార్డ్ చేయబడిన విద్యార్థుల మెరిట్ కంటే తక్కువ మెరిట్ ఉన్న వారికి సీటు ఇస్తే10 లక్షలు జరిమానా విధించబడుతుందని తెలిపింది. పైన పేర్కొన్న రెండు జరిమానాలు సంబంధిత కన్వీనర్ వద్ద ఉన్న నిధుల నుండి వసూలు చేయబడతాయని స్పష్టం చేసింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version