ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత సంవత్సరం జరిగిన ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిచిన జగన్ సర్కార్ తాను ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న రోజే పెన్షన్ ను మూడు వేలకు పెంచిన సంగతి విధితమే. అయితే 2000 ఉన్న పెన్షన్ ను ప్రతి సంవత్సరం 250 రూపాయలకు పెంచుతూ నాలుగు సంవత్సరాల్లో దానిని 3000 గా చేసే విధంగా జగన్ తన తొలి సంతకం చేశారు. ఇక ఇప్పటివరకు 2250 వరకు ఇచ్చిన జగన్ సర్కార్ సంవత్సర కాలం గడిచి పోవడంతో మరో 250 రూపాయలను జతచేస్తూ రాష్ట్రంలోని వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలకు ఈ మొత్తాన్ని గ్రామ వార్డు వాలంటరీల ద్వారా అందజేయనున్నారు.
ఇకపోతే పెంచిన ₹250 లతో కలిపి మొత్తం 2500 రూపాయలు ఆగస్టు ఒకటో తారీకు నుండి పింఛన్ దారులకు పంపిణీ చేయనున్నారు. తాము అధికారంలోకి వస్తే పింఛన్ సొమ్మును పెంచుతామని చెప్పిన సీఎం జగన్ అందులో భాగం గానే ప్రస్తుతం పింఛన్ దారులకు పంపిణీ చేయనున్నారు. దీంతో మరోసారి జగన్ ఇచ్చిన మాటని నిలబెట్టుకోవడంలో తనదైన శైలిని నిరూపించుకోపోతున్నాడు.