ఈ నెల 15న ఆంధ్రప్రదేశ్ మంత్రి మండలి సమావేశం కానుంది. సీఎం జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన వెలగపూడిలో గల సచివాలయంలో కేబినెట్ భేటీ కాబోతోంది. ఈ భేటీలో సంక్షేమ పథకాలు, కోవిడ్ నియంత్రణ చర్యలపై చర్చించనున్నట్టు సమాచారం.
ఇక గత నెల 11న జరిగిన భేటీలో ఇళ్లపట్టాలు, గృహనిర్మాణాల మార్గదర్శకాల్లో మార్పులు చేర్పులకు, వైఎస్సార్ చేయూత, జగనన్న తోడు, గుంటూరు, శ్రీకాకుళం, మచిలీపట్నం ప్రభుత్వ నర్సింగ్ కాలేజీల్లో 282 టీచింగ్, నాన్‌టీచింగ్ పోస్టుల ఏర్పాటుకు కేబినెట్ అంగీకారం తెలిపింది. అలాగే వీటితో పాటు వైఎస్సార్ సంపూర్ణ పోషణ, వైఎస్సార్ సంపూర్ణ పోషణ ప్లస్ పథకాలను కేబినెట్ ఆమోదించింది. అదేవిధంగా రాజధాని విషయంలో కూడా ఒక కీలకమైన నిర్ణయం తీసుకోబోతున్నట్టు సమాచారం.