సచివాలయంలో మసీదు కూల్చివేత.. స్పందించిన ఒవైసీ.!

-

సచివాలయంలోని పాత భవనాలను కూల్చి వేస్తున్న క్రమంలో ఆ ప్రాంతంలో ఉన్న ఆలయం, మసీదు స్వల్పంగా దెబ్బతిన్నాయి. దీంతో సచివాలయంలో ఇప్పుడున్న దానికన్నా ఎక్కువ విస్తీర్ణంలో ఆలయాన్ని, మసీదును నిర్మిస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించారు. “తెలంగాణాలో పాత సచివాలయం భవనం కూల్చివేస్తున్న కారణంగా అక్కడున్న మసీదు, ఆలయాలకు కొంత ఇబ్బంది కలగటం వల్ల  కేసీఆర్ విచారం వ్యక్తం చేసారు. ఇప్పుడున్న దానికన్నా ఎక్కువ విస్తీర్ణంలో ఆలయాన్ని, మసీదును నిర్మిస్తామని ప్రకటించారు. పాత  భవనాలను కూల్చే క్రమంలో అక్కడున్న ఆలయాలపై శిథిలాలు పడి కొంత నష్టం జరిగింది.

పాత భవనాల స్థానంలో కొత్తవి నిర్మించటమే ప్రభుత్వ ఉద్దేశం తప్ప..మందిరాలు కూల్చివేయటం కాదు. తెలంగాణ సెక్యులర్ రాష్ట్రం..ఎట్టి పరిస్థితుల్లో ఆ స్ఫూర్తిని కొనసాగిస్తాం. అందరూ అర్థం చేసుకోవాలి” అంటూ కేసీఆర్ పేర్కొన్నారు. అయితే, ముఖ్యమంత్రి కేసీఆర్‌ చేసిన ఈ ప్రకటనను ఏఐఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ స్వాగతించారు. దీనికి సంబంధించి యునైటెడ్‌ ముస్లిం ఫోరం తరఫున పూర్తి ప్రకటన విడుదల చేస్తామని శుక్రవారం వరుసగా ట్వీట్లు చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version