ఏపీలో పెంచిన పింఛన్ల పంపిణీకి సర్వం సిద్ధమైంది. న్యూ ఇయర్ వేళ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా నేటి నుంచి వారం రోజులపాటు పెన్షన్ వారోత్సవాలు నిర్వహించనున్నారు. అంతేకాక నేటి నుంచి పెంచిన పెన్షన్ పంపిణీ ప్రారంభం కానుంది. మొత్తం రూ. 2,750 నీ లబ్ధిదారులకు పెన్షన్ పంపిణీ చేయనున్నారు. ఇక కొత్తగా 2 లక్షల 31 వేల మందికి ఏపీ ప్రభుత్వం పెన్షన్ మంజూరు చేసింది. ఫలితంగా దేశంలో అత్యధిక 64 లక్షల మందికి పైగా పింఛన్ పంపిణీ చేస్తున్న ప్రభుత్వంగా ఏపీ ప్రభుత్వం నిలిచింది.
ఇక జనవరి 3న రాజమండ్రిలో పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటారు సీఎం జగన్. రెండు వారాల క్రితం జరిగిన మంత్రివర్గ సమావేశంలో పెన్షన్ల పెంపునకు సంబంధించి నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. 2022 జూలై నుంచి నవంబర్ మధ్య పింఛన్, రేషన్, ఆరోగ్య శ్రీ పథకాలకు ఎంపికైన వారికి ఆదివారం నుంచే వాటిని అందించనుంది.