శ్రీవారి భక్తులకు శుభవార్త‌.. నేడు సామాన్యులకు సర్వదర్శనం టోకెన్ల జారీ

-

వైకుంఠ ఏకాదశి నుంచి పది రోజుల పాటు శ్రీవారి వైకుంఠ ద్వారాల ద్వారా భక్తులను దర్శనానికి అనుమతించేందుకు అనుగుణంగా ఇవాళ సర్వదర్శన టోకెన్ల జారీకి టీటీడీ సిద్ధమైంది. రోజుకు 45 వేల చొప్పున 10రోజులకు ఒకేసారి 4.5 లక్షల ప్లాటెడ్ సర్వ దర్శనం టోకెన్లను ఇవ్వనున్నారు. ఇవాళ మధ్యాహ్నం 2 గంటల నుంచి తిరుపతిలోని 9కేంద్రాల్లో గల 100 కౌంటర్ల ద్వారా SSD టోకెన్లు ఇవ్వనున్నారు. పది రోజుల టోకెన్లు పూర్తయ్యే వరకు నిరంతరాయంగా జారీ చేస్తారు. వీటి వివరాలు ఎప్పటికప్పుడు తితిదే వెబ్సైట్, ఎస్వీబీసీ ద్వారా తెలుసుకొనేలా ఏర్పాట్లు చేశారు. టోకెన్ జారీ కేంద్రాల వద్ద భక్తుల కోసం అన్నప్రసాదాలు, తాగునీరు, పాలు, టీ, కాఫీ అందించనున్నారు.

ఇవీ కేంద్రాలు..: భూదేవి కాంప్లెక్స్, ఇందిరా మైదానం, రామచంద్ర పుష్కరిణి, జీవకోన జడ్పీ హైస్కూల్, విష్ణునివాసం, శ్రీనివాసం, బైరాగిపట్టెడలోని రామానాయుడు పాఠశాల (మహాత్మాగాంధీ మున్సిపల్ హైస్కూల్), ఎమ్మార్పల్లి పోలీస్ స్టేషన్ వెనుక శేషాద్రినగర్ లోని జడ్పీ ఉన్నత పాఠశాల, గోవిందరాజస్వామి సత్రాలు. తిరుమలలో స్థానికుల కోసం కౌస్తుభం విశ్రాంతి గృహంలో టోకెన్ల జారీ కేంద్రం ఏర్పాటుచేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version