ఉల్లి ధరలు సామాన్యులనే కాదు సీఎంలకు సైతం వణుకుపుట్టిస్తుంది..ఉల్లి కొనలేక సామాన్యులను భయపెడుతుంటే..ధరలు నియంత్రణలో వైఫల్యం చెందినందుకు నాయకులపై దాడులు వల్ల వారిలో భయం మొదలైంది..ఉల్లి ధరలు రోజు రోజుకు పెరుగుతున్న నేఫథ్యంలో కేంద్రం ఉల్ల్లి ఎగుమతులపై నిషేధం విధించింది..అయిన ధరలు దిగిరాకపోవడంతో ప్రజల్లో ఆగ్రహం కట్టలు తెచ్చకుటుంది..దీని ప్రభావం బీహర్ అసెంబ్లీ ఎన్నికలపై పడింది..తాజాగా బీహర్ లో సాక్షత్తు సీఎంపై దాడి చేసేలా ప్రజల్లో ఘాటు పుట్టిస్తుంది ఉల్లి..మూడవ దశ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న సీఎం నితీష్ కుమార్‌పై ఉల్లి గడ్డలతో దాడి చేశారు గుర్తు తెలియని వ్యక్తులు..చివరి దశ ఎన్నికల ప్రచారంలో భాగంగా జెడియు నేత, సిఎం నితీష్‌కుమార్ మధుబనిలో సభ నిర్వహించారు.
మధుబనిలోని హర్లాఖీ ప్రచార ర్యాలీలో పాల్గొని ప్రసంగిస్తున్న సమయంలో హఠాత్తుగా ఉల్లిగడ్డలు ఆయన మీదకు వచ్చి పడ్డాయి..అయితే అవి నితీష్‌కుమార్‌కు తగలలేదు..నిరసనను తెలపడానికే దుండగులు నితీశ్ పై ఉల్లి గడ్డలు విసిరారని సభలో పాల్గొన్న ప్రజలు తెలిపారు..వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బింది సీఎంకు రక్షణగా నిలిచారు..నితీశ్ తన ప్రసంగం ముగిసే వరకు భద్రతా సిబ్బంది రక్షణగా నిలబడ్డారు..అయితే ఉల్లిగడ్డలు విసిరేసిన వ్యక్తిని గుర్తించగా..ఆతనిపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని..అతన్ని వదలిపెట్టండంటూ నితీష్‌కుమార్ చెప్పారు..ఈ ఘటనతో ఉల్లి ధరలపై ఎంత ఆగ్రహంతో ఉన్నారో ఆర్థం అవుతుంది..బీహర్ ఎన్నికల్లో ఉల్లి మంటలు గట్టిగానే పెట్టనున్నాయి..గతంలో ఉల్లి ధరలు ప్రభుత్వాలను కూల్చిన చరిత్ర కూడా ఉంది.