కిడ్నీ స్టోన్స్ తో బాధపడేవారు వీటిని తినకూడదు..!

-

సరైన జీవన విధానం లేకపోవడం.. సరైన ఆహారం తీసుకోకపోవడం వల్ల ఈ మధ్యకాలంలో చాలా మందిలో కిడ్నీ స్టోన్స్ సమస్యలు ఉన్నాయి. దీని వల్ల చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది అయితే కిడ్నీ స్టోన్స్ తో బాధపడే వాళ్లు ఈ ఆహార పదార్థాలను తీసుకోకపోవడం మంచిది కాదు. అయితే మరి కిడ్నీ స్టోన్స్ తో బాధపడే వాళ్ళు ఏ విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి..?, ఏ ఆహారం తీసుకోకూడదు ఇలా ఎన్నో ముఖ్యమైన విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. మరి ఆలస్యమెందుకు దీనికోసమే పూర్తిగా చూసేయండి.

 

కిడ్నీ స్టోన్స్ తో బాధపడే వారిలో కనిపించే లక్షణాలు:

కడుపు నొప్పి
యూరిన్ సమయంలో కాస్త నొప్పి కలగడం
అనేకమార్లు యూరిన్ కి వెళ్లడం
బాగా ఆకలి వేయడం
వికారం
బలహీనంగా ఉండటం
అలసట జ్వరం వచ్చే అవకాశం ఉండడం

వీటిని అస్సలు తీసుకోవద్దు:

కిడ్నీ సమస్యలతో బాధపడే వాళ్ళు ఈ ఆహార పదార్థాలను తీసుకోకపోవడం మంచిది అని డాక్టర్లు చెబుతున్నారు. ఇక వాటి కోసం చూస్తే…

తక్కువ సాల్ట్ తీసుకోండి:

కిడ్నీ స్టోన్స్ తో బాధపడే వాళ్ళు సాల్ట్ ను తగ్గించడం మంచిది. అందుకనే జంక్ ఫుడ్ వంటి వాటికి దూరంగా ఉండండి. అలానే కూరల్లో వాటిలో సాల్ట్ ని బాగా తగ్గించండి.

మాంసం తగ్గించడం:

కిడ్నీ స్టోన్స్ తో బాధపడే వాళ్లు నాన్ వెజిటేరియన్ ఫుడ్ తగ్గించడం మంచిది. ఎందుకంటే నాన్ వెజిటేరియన్ ఆహారంలో ప్రోటీన్లు సమృద్ధిగా ఉంటాయి. ఎక్కువ ప్రోటీన్ తినడం వల్ల కిడ్నీలకు మంచిది కాదు.

చాక్లెట్:

కచ్చితంగా చాక్లెట్లు తీసుకోకూడదు. చాక్లెట్స్ ఎక్కువగా తీసుకోవడం వల్ల కిడ్నీ స్టోన్స్ మరింత పెరిగి పోతాయి.

విటమిన్ సి :

విటమిన్ సి తక్కువగా తీసుకోవడం మంచిది. విటమిన్ సి తీసుకోవడం వల్ల కూడా సమస్యలు వస్తాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version