గవర్నర్ కి గౌరవం ఇవ్వని వ్యక్తులు సభలోకి అడుగుపెట్టకూడదు అని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. తాజాగా అసెంబ్లీలో మాట్లాడారు. ఎన్ని ఇబ్బందులు వచ్చినా కలిసే ఉంటామని స్పష్టం చేశారు. ప్రజా ప్రయోజనాలే మా ప్రాధాన్యం అన్నారు. శాసన సభ్యులు ప్రజలకు ఆదర్శంగా ఉండాలి. గొడవలు, బూతులకు పర్యాయ పదం వైసీపీ. వైసీపీ నేతలు అసెంబ్లీలోనే ఇలా ప్రవర్తిస్తే.. బయట ఇంకేలా ప్రవర్తిస్తారో..? అని ప్రశ్నించారు.
200కి పైగా ఆలయాల ధ్వంసం గుర్తుకొచ్చింది. చంద్రబాబు అరెస్ట్ గుర్తుకొచ్చింది. వైసీపీ పాలనలో ఏపీ సంక్షోభంలో కూరుకుపోయింది. గత ప్రభుత్వంలో శాంతి భద్రతలు క్షీణించాయి. కూటమి ప్రభుత్వం సీసీ రోడ్లు నిర్మించామని తెలిపారు. పదిహేనేళ్ల పాటు కలిసే అధికారంలో ఉంటామని తెలిపారు. ప్రతిపక్ష హోదా కావాలని జర్మనీ వెళ్లాలని సూచించారు. ప్రజలకు మాట ఇస్తున్నాం.. 15 ఏళ్లు ఎన్డీఏ పాలన ఉంటుందని తెలిపారు. మేము కలిసి లేకుంటే ప్రజలకు ద్రోహం చేసినట్టే అని తెలిపారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.