అన్నం తినేవాళ్లు పార్టీ మారరు: ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి

-

కడియం శ్రీహరి పై ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. అన్నం తినే వారు ఎవరూ పార్టీ మారరని బీఆర్ఎస్ కౌశిక్ రెడ్డి మండిపడ్డారు. ‘కడియం శ్రీహరి పార్టీకి తీరని ద్రోహం చేశారు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయనకు పార్టీ ఏం తక్కువ చేసింది? ఆయన పార్టీని నమ్మించి గొంతు కోశారు. పార్టీలు మారే వారిని ప్రజలు ఛీ కొడుతున్నారు. ఆ నేతలకు పార్లమెంట్ ఎన్నికల తర్వాత నిజం తెలుస్తుంది’ అని ఆయన మండిపడ్డారు.ఇక బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్లో చేరుతున్న ఎమ్మెల్యే కడియం శ్రీహరిపై బీఆర్ఎస్ అధిష్ఠానం సీరియస్ ఉంది. ఈమేరకు ఆయనపై చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతోంది.

కాగా, తాను వరంగల్ బరి నుంచి తప్పుకొంటున్నట్లు కడియం కావ్య కేసీఆర్కు లేఖ రాసిన సంగతి తెలిసిందే. తనను మన్నించాలంటూ ఆమె అందులో కోరారు. ఇక తన కూతురు భవిష్యత్తు కొరకై బీఆర్ఎస్ పార్టీని వీడుతున్నట్లు కడియం శ్రీహరి తెలిపారు. అంతే కాకుండా, ఊహించినట్టే బీఆర్ఎస్ సీనియర్ నేత కె.కేశవరావు కూతురు, హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మి కాంగ్రెస్లో చేరారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version