ఉగాది పండుగ పర్వదినాన సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కలు రవీంద్రభారతిలో నిర్వహించిన పంచాగ శ్రవణం కార్యక్రమానికి హాజరయ్యారు. వారి వెంట మంత్రి జూపల్లి, ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి, సీఎస్ శాంతికుమారి సైతం ఉన్నారు. ముందుగా పంచాంగ శ్రవణ కార్యక్రమం పూర్తయ్యాక..
డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క రవీంద్రభారతిలో ప్రసంగించారు. ఈ ఏడాది తెలంగాణ అభివృద్ధి పథాన వెళ్తుందని పంచాంగ శ్రవణంలో వివరించారు. సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో రాష్ట్రానికి మంచి పాలన అందుతుందని నమ్ముతున్నాం. ప్రజలంతా సుభిక్షంగా, ఎలాంటి ఇబ్బందులు లేని పాలనను చూస్తారని ఆయన స్పష్టంచేశారు.