మిల్లెట్స్ తోనే సంపూర్ణ ఆరోగ్యం సాధించుకోవచ్చని గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ తెలిపారు.డైలీ తాను వాటినే వినియోగిస్తానన్నారు.రాజేంద్రనగర్ లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మిల్లెట్ రీసెర్చ్ తొమ్మిదో వార్షికోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆమె మాట్లాడుతూ… రాజ్ భవన్ కి వచ్చే అతిథులకు తాను మిల్లెట్స్ తినిపిస్తామని, నేను సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలంటే కారణం మిల్లెట్స్ అని ఆమె తెలిపారు. అంతేకాకుండా రోజులో ఎక్కువ గా పనిచేయడానికి కారణం కూడా మిల్లెట్స్ అని ఆమె పేర్కొంది.
ప్రధాని మోడీ ప్రత్యేక చొరవ తీసుకొని ప్రతి రాష్ట్రంలోని రేషన్ షాపులలో మిల్లెట్స్ పంపిణీ చేస్తే బాగుంటుందని గవర్నర్ అభిప్రాయం వ్యక్తం చేశారు. ప్రస్తుతం వరల్డ్ వైడ్ గా వీటికి మంచి డిమాండ్ పెరిగిందని ఆమె పేర్కొన్నారు.మోడీ ప్రధాని అయిన తర్వాత ప్రత్యేకంగా చొరవ తీసుకొని యోగాని అంతర్జాతీయంగా గుర్తింపు పొందేటట్లు చేశారని గవర్నర్ తమిళసై సౌందర్ రాజన్ తెలిపింది. మన పిల్లలకు జంక్ ఫుడ్ ,ఫాస్ట్ ఫుడ్ బదులుగా మిల్లెట్స్ నీ వారి డైట్లో చేరిస్తే వారు సంపూర్ణ ఆరోగ్యకరంగా ఉంటారని ఆమె సూచించారు.